APCOS ఉద్యోగులకు గుడ్ న్యూస్: కనీస టైమ్ స్కేల్ (MTS) అమలు – ఏప్రిల్ తర్వాత జీతాల్లో పెరుగుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Andhra Pradesh Corporation for Outsourced Services (APCOS) ద్వారా ప్రభుత్వ శాఖలు, వైద్య కళాశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు Minimum Time Scale (MTS) to APCOS employees. GO. 53 అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం G.O.Ms.No.53, GAD తేదీ: 07-03-2026 ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు కన్సాలిడేటెడ్ వేతనం పొందుతున్న APCOS ఉద్యోగులకు ఇకపై సంబంధిత పోస్టుకు ఉన్న టైమ్ స్కేల్‌లో కనీస బేసిక్ పే (Minimum of Time Scale) ఇవ్వబడుతుంది. Minimum of Time Scale (MTS) అనగా బేసిక్ + డిఏ + హెచ్‌ఆర్‌ఏ అని గతములో ఉన్నప్పటికి ఇప్పుడు కనీసం బేసిక్ పే ఇవ్వడం కొంత ఉపశమనం.
ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం అధికారులతో చేసిన సమీక్షలో, APCOS ద్వారా పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు నిర్దిష్టమైన టైమ్ స్కేల్ లేకుండా కేవలం స్థిరమైన కన్సాలిడేటెడ్ వేతనం మాత్రమే పొందుతున్నట్లు గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు వేతన సమానత్వం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
APCOS ఉద్యోగులకు కొరకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల్లో కొంత మేర పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ, ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.
APCOS ఉద్యోగులకు కొత్త జీతాలు ఎంత పెరుగుతాయి? – Minimum Time Scale (MTS)
ఉదాహరణలతో జీతాల పోలిక
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం APCOS ఉద్యోగులకు Minimum Time Scale (MTS) ను 01 మే 2026 నుండి అమలు చేస్తారు. అనగా జీతాల్లో పెరిగిన మొత్తం మే 2026 జీతం నుండి అందుతుంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో APCOS ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తిస్తాయి.
ఉద్యోగులకు సంబంధిత పోస్టుకు ఉన్న టైమ్ స్కేల్‌లో కనీస బేసిక్ పే మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఇంక్రిమెంట్లు (increments) ఇవ్వబడవు, ప్రభుత్వం వేరే ఉత్తర్వులు జారీ చేసినప్పటి వరకు ఇదే విధాన కొనసాగుతుంది. గడచిన కాలానికి బకాయిలు అనగా 01 మే 2026 కు ముందు కాలానికి ఎలాంటి అరియర్స్ (arrears) ఇవ్వబడవు.
ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం వలన APCOS ఉద్యోగుల ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగుతారు ఉద్యోగ స్వభావం మారదు. ఇతర సర్వీస్ షరతుల్లో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయం వల్ల వచ్చే అదనపు ఆర్థిక భారం సంబంధిత శాఖల బడ్జెట్ నుంచే భరించాలని ఉతర్వులలో తెలియచేసారు.
ఇప్పటివరకు చాలా మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కన్సాలిడేటెడ్ వేతనం మాత్రమే పొందుతున్నారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత కనీస బేసిక్ పే ఆధారంగా జీతం నిర్ణయించబడుతుంది.
(గమనిక: ఇవి ఉదాహరణ లెక్కలు మాత్రమే. అసలు జీతం సంబంధిత పోస్టు టైమ్ స్కేల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.)
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో కలిపి తాజా సమీక్షల ప్రకారం సుమారు 1,07,082 మంది APCOS ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 40 వేలమంది పనిచేయడం చాలా భాధాకరం, అందుకుకారణం రెగ్యుల శాంక్షన్ పోస్టులలో కూడా కాంట్రాక్టు విధానలో నియమకాలు చేపట్టడం.
ఈ నిర్ణయం వారికి కొంత మేర ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అయితే ఈ విధానం వలన APCOS ఉధ్యోగులకు ఏ మేరకు లాభ చేకూర్తుంది అనే దానిమీద APCOS ఉధ్యోగులు పెదవి విరుస్తున్నారు అందుకు కారణం రెగ్యులర్ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది. APCOS ఉద్యోగులకు ప్రస్తుతం లేదు, ఇంటి అద్దె భత్యం రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తుంది, APCOS ఉద్యోగులకు ప్రస్తుతం లేదు, ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది. APCOS ఉద్యోగులకు ప్రస్తుతం లేదు, రెగ్యులర్ ఉద్యోగులకు Leave benefits / Pension / PRC benefits / Promotions వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి. APCOS ఉద్యోగులకు ప్రస్తుతం లేదు ఇది వారిని కుంగదీసే అంశంగా వుంది.
ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు వలన కన్సాలిడేటెడ్ వేతనం నుండి కనీస టైమ్ స్కేల్ బేసిక్ పే కి మారడం, నెల జీతంలో ₹3,000 నుండి ₹5,000 వరకు పెరుగుదల అవకాశం మరియు భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు లేదా ఇతర అలవెన్సులు కోసం అడగటానికి అవకాశం లభించడం కొంత ఉపసంనమ్ లభించింది.

0 Comments