Ticker

6/recent/ticker-posts

Income Tax Form 16, Form 26AS ఇక కనుమరుగు

Form 16 , 26AS ఇక కనుమరుగు...ఏప్రిల్ 1 నుంచి కొత్త పేర్లు. 

ఫారం-16, 26 ఏఎస్ వంటి పేర్లు వేతన జీవులకు సుపరిచితమే. ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇకపై ఈ పేర్లు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పేర్లు వాడకంలోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అదే రోజు నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనల్లో ఈ మార్పులు ప్రతిపాదించారు.

ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఉద్యోగులకు ఫారం-16ను ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ జారీ చేస్తుంటుంది. వేతనంపై టీడీఎస్ రూపంలో ఎంత మినహాయించిందీ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కొత్త ఏడాదిలో దీన్ని ఫారం 130గా వ్యవహరించనున్నారు. వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫారం 26 ఏఎస్ను ఇకపై ఫారం-168గా వ్యవహరించనున్నారు. వీటితో పాటు ఫారం 16ఏ-ఫారం 131; ఫారం 24 క్యూ ఫారం 138; ఫారం 26క్యూ - ఫారం 140; ఫారం 26క్యూ ఫారం 144గా మారనున్నాయి.

కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, 26ఏఎస్ వంటివి చెల్లుబాటు అవుతాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ముసాయిదా. నిబంధనలపై ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. ఈ ముసాయిదా నిబంధనల పై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏళ్లుగా వాడుకలో ఉన్న ఫారాల పేర్లు మార్పు వల్ల ఆదిలో ఇబ్బందులు ఎదురైనా క్రమంగా పన్నుచెల్లింపుదారులకు అలవాటైపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఫారం 16, ఫారం 26AS బదులుగా వచ్చిన కొత్త ఫారాలు ఇవే చూసుకోండి!

🌸𝗜𝗡𝗖𝗢𝗠𝗘 𝗧𝗔𝗫 𝗙𝗢𝗥𝗠𝗦 𝗨𝗣𝗗𝗔𝗧𝗘

🔁 𝗢𝗟𝗗 ➜ 𝗡𝗘𝗪

𝗙𝗼𝗿𝗺-16 ➜ 𝗙𝗼𝗿𝗺-130

👨‍💼 జీతం & TDS వివరాలు

𝗙𝗼𝗿𝗺-26𝗔𝗦 ➜ 𝗙𝗼𝗿𝗺-168

📑 వార్షిక పన్ను క్రెడిట్

𝗙𝗼𝗿𝗺-16𝗔 ➜ 𝗙𝗼𝗿𝗺-131

💰 ఇతర ఆదాయంపై TDS

𝗙𝗼𝗿𝗺-24𝗤 ➜ 𝗙𝗼𝗿𝗺-138

📋 జీతాల TDS స్టేట్‌మెంట్

𝗙𝗼𝗿𝗺-26𝗤 ➜ 𝗙𝗼𝗿𝗺-140

🧾 జీతేతర చెల్లింపులు

𝗙𝗼𝗿𝗺-26𝗤𝗕 ➜ 𝗙𝗼𝗿𝗺-144

🏠 ఆస్తి విక్రయం TDS



Post a Comment

0 Comments