ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Finance Department, Government of Andhra Pradesh
(HR.I-PLG & పాలసీ విభాగం)
ప్రెస్ నోట్
సర్క్యులర్ మెమో నం. 1389438/HROPDPP/49/2021
తేదీ: 16-02-2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్-టైమ్, గెస్ట్ మరియు ఇతర తాత్కాలిక వర్గాల ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు కాంట్రాక్ట్ మరియు పార్ట్-టైమ్ ఉద్యోగుల జీతాలు నేరుగా CFMS ద్వారా ప్రాసెస్ చేయబడుతున్నాయి. అయితే, ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల పేరోల్ వ్యవస్థ 2022 సంవత్సరం నుండి NIDHI Portal ద్వారా నిర్వహించబడుతున్న నేపథ్యంలో, తాత్కాలిక వర్గాల ఉద్యోగులను కూడా అదే పేరోల్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయంతీసుకున్నారు.
దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్ మెమో నం. HROPDPP/49/2021-1 (తేదీ: 26-05-2025) మరియు సర్క్యులర్ మెమో నం. 1389438/HROPDPP/49/2021-1 (తేదీ: 13-12-2025)లను సూచిస్తూ, PSEలలో పేరోల్ వ్యవస్థను రెండు దశలుగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో డిసెంబర్ 2025 నుండి ఆరు PSEలలో అమలు చేయబడింది. జనవరి 2026 నుండి మిగతా అన్ని PSEలలో NIDHI పేరోల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 2026 నెల నుండి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అన్ని కాంట్రాక్ట్, పార్ట్-టైమ్, గెస్ట్ మరియు ఇతర తాత్కాలిక వర్గాల ఉద్యోగుల జీతాలను NIDHI పేరోల్ మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులను NIDHI పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయుటకు అవసరమైన SOPలను పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది.
ప్రస్తుతం జీత బిల్లులు ముందుగా NIDHI పోర్టల్‌లో ప్రాసెస్ చేయబడిన తరువాత CFMS ద్వారా ట్రెజరీకి సమర్పించవలసి వచ్చేది.
ఈ ఉత్తర్వులు విద్యాశాఖలో పనిచేస్తున్న MTS ఉపాధ్యాయులు, పార్ట్-టైమ్ లెక్చరర్లు తదితర తాత్కాలిక సిబ్బందికి కూడా వర్తిస్తాయి.
ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి సహాయం కోసం O/o APCFSS లోని శ్రీ ఉమా మహేష్ (మొబైల్: 9948637899) మరియు శ్రీ వెంకట్ (మొబైల్: 9182352549)లను సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయంలోని అన్ని విభాగాధిపతులు పై సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని మరియు తమ పరిధిలోని కార్యాలయాలకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించబడినది.
— ఆర్థిక శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

0 Comments