ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APHAMSA) తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ మరియు ఆర్థిక శాఖను, 02 జూన్ 2014కి ముందు పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేస్తు RTI ద్వారా సమాచారం ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
Act 30 of 2023 మరియు G.O. Ms. No. 114 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను అందించాలని క్రింది అంశాలపై విజ్ఞప్తి చేయడం జరిగింది.
➤ 02 జూన్ 2014కు ముందు ఉన్న ఖాళీలలో ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగుల మొత్తం సంఖ్య ఎంత?
➤ పై చట్టం మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెగ్యులరైజ్ చేయబడిన వారి సంఖ్య ఎంత?
➤ ఇంకా రెగ్యులరైజేషన్ పెండింగ్‌లో ఉన్న వారి సంఖ్య ఎంత?
➤ కొందరు మాత్రమే రెగ్యులరైజ్ చేయబడినట్లయితే, వారి సంఖ్య ఎంత? ఇతరులను ఎందుకు పక్కనపెట్టారు?
➤ 02 జూన్ 2014కు ముందు ఖాళీలలో ఎంపికై, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల మొత్తం సంఖ్య ఎంత?
➤ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను నిలిపివేయడానికి గల కారణాలు ఏమిటి?
➤ ఈ ప్రక్రియను నిలిపివేయాలనే అధికారిక ఆదేశాలు ఏవైనా జారీ చేయబడినట్లయితే, వాటి పూర్తి వివరాలను అందజేయాలి.
అదనంగా, G.O. Ms. No.114 ప్రకారం ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగుల కేడర్ వారీ పెండింగ్ వివరాలు అందజేయాలని మనవి చేస్తున్నాము.
ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్య సేవల్లో, ముఖ్యంగా కోవిడ్ సమయంలో విశేషంగా సేవలందించారు. చట్టం స్పష్టంగా అమలులో ఉన్నప్పటికీ కొందరినే రెగ్యులరైజ్ చేయడం అన్యాయంగా భావించబడుతోంది. అందువల్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని, పారదర్శకంగా పూర్తి వివరాలు వెల్లడించి, పెండింగ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పునఃప్రారంభించాలి.
Arava Paul
అధ్యక్షుడు, APHAMSA
ఆంధ్రప్రదేశ్
.jpg)

0 Comments