ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ అలర్ట్
పెన్షనర్లు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్ ఆమోదించబడిందా లేదా అన్న విషయాన్ని మనం జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
దీనికోసం క్రింది లింక్‌పై క్లిక్ చేసి జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి:
https://jeevanpramaan.gov.in/v1.0/ppouser/login
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినప్పుడు పొందిన జీవన్ ప్రమాణ్ ఐడిని నమోదు చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ నమోదు చేసిన వెంటనే మీ లైఫ్ సర్టిఫికెట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
సర్టిఫికెట్‌ను క్రిందికి స్క్రోల్ చేసి చూస్తే “Note” వద్ద మీ లైఫ్ సర్టిఫికెట్ ఆమోద స్థితి (Status) కనిపిస్తుంది.
ఉదాహరణకు:
“Your Digital Life Certificate has been successfully accepted by Andhra Pradesh Treasury - Sub Treasuries (STO Amalapuram)” అని చూపిస్తుంది.
మీరు ఒకటి కంటే ఎక్కువసార్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్లయితే, మొదట సమర్పించినదే ఆమోదించబడుతుంది.
తర్వాత సమర్పించిన వాటికి రిజెక్ట్ అయినట్లు చూపిస్తూ కారణాన్ని కూడా తెలియజేస్తుంది.
ఉదాహరణకు:
“Your Digital Life Certificate has not been accepted by Andhra Pradesh Treasury - Sub Treasuries (STO Amalapuram) due to Pensioner AADHAR No Mismatch with AP Pension Payroll System or LC is already submitted with same AADHAR No & recorded in the Pension Payroll System. Please contact your Pension Processing Authority.”
అందువల్ల, పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన జీవన్ ప్రమాణ్ ఐడి ద్వారా సర్టిఫికెట్ ఆమోదం పొందిందా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.

0 Comments