Ticker

6/recent/ticker-posts

తొలగించిన MPHA M ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.


AP HAMSA; 22.12.2024: అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు నందు 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న MPHA-M లను  తొలగించడం  చాలా బాధాకరం అని, తొలగించిన MPHA M ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకునే అంశం ప్రభుత్వం మానవతా దృక్పధంతో చూసి న్యాయం చేయాలని అందుకు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాష్ట్రంలోని తొలగించబడిన అందరూ కాంట్రాక్టు ఉద్యోగస్తులను ఒక తాటిపైకి తీసుకువచ్చి వారందరికీ తిరిగి విదులులోకి తీసుకువచ్చే అంశాన్ని సమీక్షించేందుకు ఈరోజు విజయవాడ పట్టణంలో CITU ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం  ద్వారా ఏపీ హంస తరఫున వారందరికీ పూర్తి మద్దతు ఇచ్చి వారంతా ఉద్యోగాలలో చేరేంతవరకు కూడా వారి వెంటే ఉంటామని ఏపీ హంస అధ్యక్షులు శ్రీ అరవ పాల్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ హంస తరుపున జాయింట్ జనరల్ సెక్రెటరీ శ్రీ జాన్ హెన్రీ గారు పాల్గొనడం జరిగింది. 

Post a Comment

1 Comments

  1. ముందుగా 143 మరియు 32 జీవోల.. ఉన్నతాధికారులును వెంటనే రద్దు పరచి, ఈ ఉత్తర్వులలోనే నిబంధనలకు వ్యతిరేకంగా కౌన్సిలింగ్ జరిపిన జోనల్ స్థాయి మరియు రాష్ట్రస్థాయి అధికారుల పైన విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించవలెను. ఈ ఉత్తర్వుల ప్రకారము కౌన్సిలింగ్లో ఒక పీహెచ్ నుండి మరియొక పీహెచ్సీ కి సిబ్బందిని సర్దుబాటు చేయవలసి ఉంది. కానీ కొందరు అధికారులు పీహెచ్సీలో ఉన్న సిబ్బందిని తీసుకువచ్చి జిల్లా కార్యాలయాలలో నియమించినారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఉత్తర్వులలో మార్పు చేస్తూ జిల్లా కేంద్రాలలో కొంతమందిని నియమించినారు ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడినారు కాబట్టి ఆ విధంగా కౌన్సిలింగ్లో మార్పులు చేసినారు. ఇప్పటికీ ఈ జీవోల వలన ఉన్నతాధికారులకు ధనార్జన తోడ్పడుతుంది. రెండు సంవత్సరాల తర్వాత కూడా నియామకాలు జరిగిన తర్వాత మళ్లీ కొంతమంది అనేక అడ్డదారులలో వారి పాత స్థానాలకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు 143 మరియు 32 ఉత్తర్వులు ఎక్కడ ఉన్నవి. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఈ ఉత్తర్వులను పూర్తిగా రద్దు పరచి జనాభా ప్రాతిపదికన దార్శనికంగా కొత్త విధానము తీసుకువస్తే అటు ప్రజలకు ఇటు ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్య ఉండదు.

    ReplyDelete