జాతీయ కుష్టు నివారణ కార్యక్రమము -
SPARSH -2020
కుష్టువ్యాధి ఫై తరచుగా అడిగే ప్రశ్నలు
1. కుష్టువ్యాధి అనగా నేమి? ఈ వ్యాధికి కారణము ఏమి?
a.
కుష్టువ్యాధి
మైకోబక్టీరియం లెప్రీ (Mycobacterium leprae) అనే సుక్ష్మ క్రిమి ద్వారా సోకే దీర్ఘకాలిక అంటు వ్యాధి. ఈ వ్యాధి
ముఖ్యంగా చర్మము మరియు నరములకు సోకుతుంది ఈ వ్యాధి కారక క్రిమిని నార్వే దేశానికి
చెందిన Dr. హన్సన్ అను శాస్త్రవేత్త 1873 లో కనుగొన్నాడు.
2.
కుష్టు వ్యాధి
ఎలా వ్యాపిస్తుంది?
a.
వ్యాధి
గ్రస్తుడైన చికిత్స పొందని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సోకుతుంది.
వ్యాధి గ్రస్తుడు. మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలుబడే తుంపర్ల ద్వారా
(droplet infection) ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది.
b.
కుటుంబములో
ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన కుటుంబ సబ్యులకు అందరికీ ఈ వ్యాధి రాదు. ఇతర అంటు
వ్యాధులవలె కుపువ్యాధి వేగంగా మరొకరికి సోకదు. మనలో జన్మతహ వున్న వ్యాధి నిరోధక
శక్తి వలన దాదాపు 90 శాతము మంది ఈ
వ్యాధికి గురి కారు.
c.
కుష్టు
వ్యాధి కి సంభందించిన క్రిమి శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు బయట
పడడానికి దాదాపు రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలము పడుతుంది (incubation period)
3.
కుష్టువ్యాధి
అని ఎలా సందేహించాలి?
a.
చర్మము పై
ఎర్రని లేక రాగి రంగు మచ్చలు లేక శరీర వర్ణము కంటే కొంచెము పాలిపోయినట్టున్న మచ్చలు:
స్పర్శ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కోల్పోయిన మచ్చలు
b.
చర్మము
ఎర్రగా (కంది నట్లుగా), ముఖ్యంగా చెవులు,
ముఖము, కాళ్లు, చేతులు
మరియు శరీరము పై బుడిపెలు వుండడము
c.
కాళ్లు, చేతులు, ముఖము (నోటి, కళ్ళ) కండరాల బలహీనత మరియు వంకరగా ఉండడం నరములు ఉబ్సినట్లుగా ఉండి
నొప్పిగా అనిపించడము
d.
కళ్ళు సరిగా
మూయ లేక పోవడం
e.
దైనందిన
కార్యక్రమాలు నిర్వహించుకోవడములో ఇబ్బంది కలిగి వుండడము ఉదా: కాలికి వేసుకున్న
చెప్పులు మాటిమాటికి జారిపోవడము, పెన్ను వంట
పాత్రలు, కొడవలి, పరక వంటి వస్తువులు
సరిగా పట్టుకోలేక పోవడము, వంట చేసే సమయములో అర చేతులకు
తెలియకుండానే బొబ్బలు రావడము లేక ఎక్కువ దూరము నడచి నప్పుడు తెలియకుండానే అరికాలి
పై బొబ్బలు రావడము ఆ బొబ్బలు నొప్పిగా అనిపించకుండా వుండడము,
పైన చెప్పబడిన లక్షణాలు ఏ వ్యక్తి
లోనైన మీరు చూచినట్లైతే, వ్యాధి నిర్ధారణ
కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములోని వైద్యుని లేదా సంబంధిత ఆశా కార్యకర్తను గాని,
ఆరోగ్య కార్యకర్తను గాని సంప్రదించమని తెలియజేయండి
4.
కుష్టువ్యాధి
ఎన్ని రకములు? అవి ఏవి ?
(వర్గీకరణ)
కుష్టువ్యాధి ప్రధానంగా రెండు రకములు
a.
పాసీ
బాసిల్లరి కేసులు (Pauci Bacillary)1-5 మచ్చలు వుండి ఒక నరము మాత్రమే జబ్బుకు గురి అయి ఉబ్బినట్లు వుండడము లేక
ఒక్క నరము కూడా. ఉబ్బి ఉండక పోవడము.
b.
మల్లి
బాసిల్లరి కేసులు 6 లేక అంతకంటే
ఎక్కువ మచ్చలు (Multi Bacillary) ఒకటి లేక అంతకంటే ఎక్కువ
నరములు జబ్బుకు గురి అయి ఉబ్బినట్టు వుండడము
5.
కుష్టువ్యాధి
నయము అవ్వుతుందా?
a.
బహుళ ఔషధ
చికిత్స (Multi Drug Treatment ) సక్రమంగా తీసుకొన్నట్లయితే, కుష్టువ్యాధి నయం
అవుతుంది
6.
రోగికి
కుఘవ్యాధి చికిత్స ఎక్కడ దొరుకుతుంది?
a.
అన్ని
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రములలో కుష్టువ్యాధి చికిత్స ఉచితంగా దొరుకుతుంది.
7.
ఎంత కాలం
కుష్టువ్యాధి చికిత్స తీసుకోవాలి?
a.
పాసీ
బాసిల్లరి (PB) కేసు: ఆరు నెలలు
b.
మల్లి
బాసిల్లరి (MB) కేసు: పన్నెండు
నెలలు సక్రమంగా తీసుకోవాలి
8.
కుష్టువ్యాధి
వలన కలిగిన అంగవైకల్యం మరల సరిచేయవచ్చా?
a.
కుష్టువ్యాధి
వలన అంగవైకల్యం పొందినవారి కోసము ప్రభుత్వము అంగవైకల్య నివారణ మరియు వైద్య
పునరావాసం (Disability Prevention & Medical
Rehabilitation - DPMR) అను కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ
కార్యక్రమము క్రింద అంగవైకల్యం పొందిన వారికి ఎంపిక చేసిన కొన్ని ఆసుపత్రులలో ఉచిత
శస్త్ర చికిత్స నిర్వహించి (ఉచిత భోజన, వసతి తో సహా) రూ.8000
ల ఆర్థిక సహాయము కూడా అంద చేస్తారు.
9.
కుష్టు వ్యాధి
వలన అంగవైకల్యము కలిగిన వారికీ చేతులు కళ్ళు మొద్దుబారి నట్టు వున్నా వారికీ స్వయం
సంరక్షణ పై మనము ఏమి సలహా ఇవ్వవచ్చు
a.
చేతులను
కాళ్ళను నీటిలో అర గంట సేపు ఉంచాలి.
b.
తరువాత తేమ
ఉండగానే నునే లేక వాస్టిన్ రాయాలి.
c.
వేడి మరియు
రాపిడి నుండి చేతులను కాళ్ళను కాపాడు కోవాలి.
d.
స్పర్శ లేని
అరికాలు ఉన్నట్లైతే MCR చెప్పులను
ధరించి నెమ్మదిగా చిన్న అడుగులు వేస్తూ నడవాలి
e.
గాయములను/పుండ్లను
నీటితో శుబ్రముగా కడిగి శుబ్రమైన బట్టతో కట్టు కట్టాలి.
f.
ప్రతి దినము
అద్దములో కళ్ళను పరీక్ష చేసుకొవాలి.
10.
ఈ వ్యాధి
పట్ల / వ్యాధి గ్రస్తులపట్ల మనము నిర్వహించవలసిన సామజిక భాద్యత ఏమిటి.?
a.
కుష్టువ్యాధి
అని అనుమానము ఉన్న వ్యక్తులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నకు పంపించవలెను
b.
కుష్టువ్యాధి
గురించి అవగాహన మరియు పరిఙ్ఞానము సమాజములో కలుగజేయాలి.
c.
కుష్టువ్యాధి
చికిత్స తీసుకుంటున్న వారిని సక్రమముగా మందులు వాడునట్లు ప్రోత్సహించాలి
d.
కుష్టువ్యాధి
సోకిన వారు మనలో ఒకరని సమాజములో భాగమని ఆ వ్యక్తి పట్ల ఎలాంటి వివక్ష తగదని
ఇతరులకు తెలియచేయాలి
e.
ప్రజలలో ఈ
వ్యాధి పట్ల వున్నా మూఢ నమ్మకాలు, భయాలు,
అపోహలు తొలగించడానికి నిర్వహించు ప్రత్యేక శిభిరములలో అవగాహన సదస్సులు
లోనూ భాగస్వాములు కావలెను.

0 Comments