సరళత, ఓర్పు, ప్రశాంత స్వభావం, కర్తవ్య నిర్వహణలో పట్టుదల మరియు ప్రజల కష్టాలకు స్పందిచాలనే సంసిద్ధత ఆమెకు మహిళలు మరియు సాధారణ ప్రజల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అనతపురం జిల్లాలో కోవిడ్-19 ఆపరేషన్లు ఉధృతంగా జరుగుతున్న సమయంలో, అనంతపురం జిల్లా జాయింట్ జాయింట్ కలెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న మేడం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోవిడ్ ఔట్‌రీచ్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమించబడినందున ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. వైద్యుని హృదయాన్ని కలిగి ఉండి, సమర్థుడైన నిర్వాహకురాలిగా తన పనిని నిర్వర్తిస్తూ, కోవిడ్ రోగులను బాగా చూసుకోవడమే కాకుండా కోవిడ్ ఆసుపత్రులు మరియు సంరక్షణ కేంద్రాల వద్ద సమర్ధవంతంగా పనిచేయించ గలిగారు.
పేదల కోసం ఏదైనా చేయాలనే తపన ఆమె ఆలోచనా పరిధిని విస్తరించింది మరియు ఐఎఎస్ అధికారి అవ్వడంద్వారా సామాన్యులతో కనెక్ట్ అవ్వడం ద్వారా పేదలకు మెరుగైన సేవలు చేయటానికి అవకాశం వుంటుంది అనే ఆలోచన ఆమెను ఐఏఎస్ అధికారిగా మార్చింది.
తరువాత కాలంలో ఆమె డైరెక్టర్, సెకెండరి హెల్త్ భాద్యతలు స్వీకరిచిన మొన్న విజయవాడలో వచ్చిన సంధర్భంలో తన మార్కు చూపించడం ద్వారా వరదల తరువాత సంభవించే వ్యాధుల నుండి ప్రజలను కాపాడటంతో ప్రశంసలు అందుకున్నారు.
ఈ రోజు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి డైరెక్టర్ గా సిరి మేడమ్ రావడం వలన పబ్లిక్ హెల్త్ విభాగంలో సమస్యలు తీరతాయని అందరితో కలసి పనిచేయగల సమర్ధవంతమైన అధికారిణి రావడం సంతోషం గా వుందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు Dr. జయధీర్ తెలియచేసారు.
0 Comments