Ticker

6/recent/ticker-posts

చిన్నపాండూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మహిళా ఉద్యోగికి తీరని అన్యాయం

  • చిన్నపాండూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మహిళా ఉద్యోగికి తీరని అన్యాయం
  • మెడికల్ ఆఫీసర్ అలసత్వం-నెలలు గడుస్తున్నా అందని వేతనం
  • UDC చేతివాటం, 20 నెలలుగా జీతం నిలిపివేత
  • మితిమిరీన UDC ప్రవర్తన, మహిళా ఉద్యోగులపై అజమాయిషీ, బెదిరింపులు
  • ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించుకున్న ఫలితం శూన్యం

మహిళా ఉద్యోగుల సమస్యల పట్ల ఖనీస భాద్యత చూపని మెడికల్ ఆఫీసర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా నెలలు తరబడి జీతాలు అందక, కుటుంబ పోషణ భారమై దీనావస్థను ఎదుర్కోంటున్న మహిళా ఉద్యోగిని పరిస్థితి వర్ణణాతీతంగా మారిన ఘటన తిరుపతి జిల్లా చిన్నపాండూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో వెలుగుచూసింది. చిన్నపాండూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రం మెడికల్ ఆఫీసర్ అనిత తెలిపిన సమాఛారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక్కడ ఔట్ సోర్సింగ్ విధానంలో FNO గా పనిచేస్తున్న సునీత అనే మహిళా ఉద్యోగికి నెలలు తరబడి జీతం నిలిపివేయబడిన విషయం వాస్తవమే, కానీ జీతాలు పరిధి మెడికల్ ఆఫీసర్ కి సంబంధం లేదు జీతాల క్లర్క్(UDC) చేతిలో ఉద్యోగుల జీతాల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉంటాయి, మా మటుకు మేము ప్రయత్నిస్తున్నాము తప్పక న్యాయం చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ UDC గా పనిచేస్తున్న సోమశేఖర్ ఉద్యోగుల జీతాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే సమాఛారం, ఉద్యోగుల లాగిన్ లు మార్చివేయడం, సమయానికి రావాల్సిన జీతాలను తప్పుడు ఆప్టేట్ లతో తారు మారు చేయడంలో అందవేసిన చేయిగా తెలిసింది. ఆస్పత్రి నిర్వాహణ లో ప్రస్తుత మెడికల్ ఆఫీసర్ అలసత్వం , UDC ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలం కాగా పరోక్షంగా సహకరిస్తూ క్రిందిస్థాయి ఉద్యోగుల పై కక్ష్యసాధింపులకు దిగుతున్నారనే తెలియవచ్చింది. ప్రధానంగా UDC ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా, మహిళా ఉద్యోగులపై బెదిరింపులు, అజమాయిషీ లు , దురుసుప్రవర్తన తో మానసిక వేదనకు గురిచేస్తున్నాడని తెలిసినా మెడికల్ ఆఫీసర్ చర్యలు చేపట్టకపోవడం పలుఅనుమానాలకు తావిస్తున్నది.

జీతం అడిగితే బెదిరిస్తున్నారు...! - భాదిత మహిళా ఉద్యోగిని ఆవేదన

గత 20 నెలలుగా జీతం రాలేదు, ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు , రోజు గడవటమే కష్టంగా ఉంది, కుటుంబ పోషణ భారమైంది అంటూ భాదిత మహిళ ఉద్యోగిని కన్నీటి పర్యాంతమవుతున్నది. జీతాల వివరాలు సక్రమంగా అప్డేట్ చేసి సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన UDC సోమశేఖర్, జీతాలు వచ్చేలా చూడండి సార్ అని అడిగితే బెదిరిస్తున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాగా సంబంధిత సమస్యపై యుడిసి సోమశేఖర్ ను వివరణ కోరగా , లాగిన్ సమస్యలు ఉన్నాయనీ, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామంటూ మాటదాటవేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపాండూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ఇరవై నెలలుగా ఒక మహిళా ఉద్యోగికి జీతాలు నిలిపి వేసి ఇబ్బందులు గురిచేయడం భాధాకరం, వ్యవస్థాపరమైన లోపాలు కంటే వ్యక్తిగత ఉద్దేశ్యపూర్వకంగా క్రిందిస్థాయి ఉద్యోగులను వేదిస్తున్నారనే స్పష్టమౌతున్నది.  ఇకనైనా జిల్లా అధికారులు ఇక్కడ పరిస్థితిని సమీక్షించి భాదిత మహిళా ఉద్యోగికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.



Post a Comment

0 Comments