Ticker

6/recent/ticker-posts

నూతన చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన AP HAMSA

రాజధాని:  రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నీరబ్ కుమార్ గారిని ఈ రోజు విజయవాడలోని CS గారి క్యాంపు కార్యాలయంలో  గౌరవపూర్వకంగా కలిసి వారిని సత్కరించిన ఏపీ హంస బృందం.
గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అరవ పాల్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కొరకు రిప్రజెంటేషన్ చేయటానికి అవకాశం కల్పించాలని కోరటం జరిగింది. 
ప్రభుత్వం ఏర్పడే హడావుడి అంతా ముగిసిన వెంటనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమస్యను పరిష్కరించడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తానని ఏపీ హంసకు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు హామీ ఇవ్వడం జరిగింది. 



 ఈ కార్యక్రమమునకు ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షులు అరవాపాల్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, జాయింట్ జనరల్ సెక్రెటరీ జాన్ హెన్రీ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు, సెక్రటరీ బొక్క కిరణ్ గారు, మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి ఎన్ వి ప్రసాద్ గారు విజయవాడ పట్టణం నుంచి రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది. 

Post a Comment

0 Comments