మదనపల్లె లోని సర్వజన వైద్యశాలలొ విధులు నిర్వర్తిస్తున్న సుమారు 76 మంది ఉద్యోగులకి గత నాలుగు నెలలుగా జీతాలు అందలేదనే ఫిర్యాదు మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా AP-HAMSA ఆద్యక్షుడు రాజా గారు మదనపల్లి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంటు డా.ఎమ్.ఎస్.రాజు గారిని కలసి సమస్యలపై చర్చించడమైనది. అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దాత్తేశ్వరి మేడమ్ తో ఈ విషయమై చర్చించి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సమస్యని వేగవంతంగా పరిష్కారించాలని కోరడమైనది.మెడికల్ సూపరింటెండెంట్ , అసిస్టెంట్ డైరెక్టర్ లు ఈ విషయమై పరిశీలించి సమస్యని త్వరలోనే పరిష్కారిస్తామని తెలియచేసారు.
మదనపల్లిలోని సర్వజన వైద్యశాల యందు పనిచేయు నాలుగో తరగతి ఉద్యోగులు, మరియు జిడిఎ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా వారి యొక్క పని భారం,వారి యొక్క డ్యూటీ సమయాల పై సూపర్డెంట్ గారితో చర్చించి వారి యొక్క సమస్యలపై సత్వరమే పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కోరడమైనది.కొత్తగా ఏర్పడుతున్న ఈ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ యొక్క బెడ్ స్ట్రెంత్ ఆధారంగా వైద్య సిబ్బందిని , పారామెడికల్ సిబ్బందిని, నర్సింగ్ సిబ్బందిని, మినిస్టరియల్ స్టాఫ్ సిబ్బందిని అ రోగుల యొక్క బెడ్స్ స్ట్రెంగ్త్ ని ఆధారంగా కొత్త సిబ్బందిని కూడా పెంచాలని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని హంస కోరుతున్నది .
AP-HAMSA కొత్తగా ఏర్పడుతున్న మెడికల్ కాలేజీలను స్వాగతిస్తూ.. దానికి అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచాలని ఆ విధంగా పెంచినట్లయితేనే ప్రజలకి రోగులకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని హంస కోరుతున్నది.
మెడికల్ సూపర్డెంట్ డా. రాజుగారు కూడా వసతులు, సిబ్బంది సౌకర్యాలు ,కూడా చాలా తక్కువగా ఉన్నందున పనిభారం ఎక్కువగా ఉన్నది వాస్తవమే అని అన్నారు .NMC పరశీలకుల విసిట్ త్వరలో ఉన్నందున పనిభారం ఎక్కువైంది. ఇవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని, ప్రభుత్వానికి చాలా సార్లు వినతులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజా, ఉపాధ్యక్షుడు ఇమ్రాన్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గిరిశ్రీనివాస్, హంస నాయకులు రాజేష్, ఆది, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments