Ticker

6/recent/ticker-posts

ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ వైద్య సేవలు పూర్తి ఉచితం, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

 విజయవాడ,  తేది:20.06.2024

  • ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌  వైద్య సేవలు పూర్తి ఉచితం..
  • రోగుల నుండి రుసుము వసూలు పిర్యాదులు వస్తే చర్యలు..
  • మెరుగైన వైద్య సేవలు అందించండి..జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు.


          నిరుపేదలకు  కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ పథకాన్ని పటిష్టంగా  అమలు చేయాలని,     ఉచిత  వైద్య సేవలపై రోగుల నుండి  రుసుము వసూలు చేసే ఆసుపత్రి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ పథక అమలు పై కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన ఛాంబర్‌లో జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 

సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుపేదలకు కార్పోరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోట్లాదిరూపాయల నిధులను  వెచ్చించి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌  పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. పేదవారు వైద్య సహాయం పొందేందుకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనే ఉద్ధేశంతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులలో  రోగుల నుండి రుసుమును వసూలు చేస్తున్నట్లు ఫిర్యాధులు వస్తున్నాయన్నారు. ఈ నేపధ్యంలో కమిటీ సభ్యులు ఆసుపత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. రుసుము వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాధులపై తక్షణమే స్పందించి, ప్రాధమిక విచారణను పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ను ఆదేశించారు. పిర్యాదులు చేసిన లబ్దిదారులు,  ఆసుపత్రి యాజమాన్యలతో జిల్లా కలెక్టర్‌, కమిటీ సభ్యులు ఫోన్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వాస్తవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ పథకం అమలు చేస్తున్న ప్రైవేట్‌, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల నుండి ఎటువంటి రుసుమునైనా వసూలు చేసినట్లు ఫిర్యాధులు వస్తే విచారణ నిర్వహించి ఆరోపణలు రుజువైతే సంబంధిత ఆసుపత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని కలెక్టర్‌ డిల్లీరావు హెచ్చరించారు. 

సమావేశంలో కమిటీ సభ్యులు ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ డా. జె. సుమన్‌, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసిహెచ్‌ డా.బి.సి.కె. నాయక్‌,  ప్రముఖ వైద్య నిపుణులు డా. జి. సమరం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments