Addl మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యొక్క కార్యాలయం. ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం మరియు సూపరింటెండెంట్ వారి ఉత్తర్వులు మేరకు గ్రామ సచివాలయం ఏఎన్‌ఎం Gr-III గా సెల్కెట్ కాబడి మరియు గతములో Gr-II గా నియామకం కాబడి ప్రభుత్వం కల్పించిన సౌకర్యం మేరకు MPHA (F) నుండి 2 సంవత్సరాల వ్యవధి కలిగిన స్పెషల్ ఇంటెన్సిఫైడ్ GNM శిక్షణ కాలం తేదీ. 29.06.2024. పూర్తయింది అని వారిని ట్రైనింగ్ ప్రోగ్రాం నుండి గౌ. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు మేరకు వారిని ట్రైనింగ్ నుండి విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది
2 సంవత్సరాల పాటు MPHA (F) కోసం ప్రత్యేక ఇంటెన్సిఫైడ్ ఇన్-సర్వీస్ GNM ట్రైనింగ్ ఆర్డర్‌లను పొందుతున్న వ్యక్తులు 30.06.2024 నాటికి రాజమహేంద్రవరంలోని GTGH శిక్షణ రిలీవ్ చేయడం జరిగింది. వారంతా ఆరు గతములో పనిచేసిన సంబంధిత పోస్టింగ్ ప్రదేశాలలో రిపోర్ట్ చేయాలని తెలియచేసారు మరియు అవసరమైన తదుపరి సమాచారాన్ని వారి ఉన్నతాధికారులకు తదనుగుణంగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్ అధిపతులు తరువాత కాలంలో పంపడం జరుగుతుంది అని తెలియ చేశారు.
అయితే గతములో CFW అధ్యక్షతన మంగళగిరి APIIC భవన్ లో జరిగిన అన్ని యూనియన్ల మీటింగ్ నకు అన్ని సంఘాల నుండి నాయకులు హాజరు అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ANM Gr -III / MPHA (F) లుగా పనిచేస్తూ GNM ట్రైనింగ్ కి వెళ్లి staff nurse గా వెళ్లడానికి అర్హత సంపాదించిన అందరికి దిశానిర్దేశం చేయడం కోసం సలహాలు సూచనల కోసం కమిషనర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.
- కోర్టు కేసులు ఏమీ ఈ విషయంలో అడ్డం రాకుండా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- DPHFW, DME & APVVP లలో ఉన్న Vacant పోస్టుల ఆధారంగా Ratio maintain చేస్తూ (అనగా కొంత మంది direct recruitment/కొంత మంది pramotion/కొంత మంది inservice ట్రైనింగ్ పూర్తి చేసిన వారు) వీరి యొక్క నియామకం చేపట్టాలి.
- GNM training పొందిన అందరికీ స్కేలు వర్తింపు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
- ట్రైనింగ్ పొందిన వారికి GNM పోస్టింగు ఇచ్చే సందర్భంలో రూరల్ PHC లలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి.
- కొత్తగా GNM ట్రైనింగ్ పూర్తి చేసి పోస్టింగ్ కోసం ఎదురు చేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో వీరి అంశం చేర్చడం ద్వారా తదుపరి ఎటువంటి ఆటంకం కరగకుండా చర్యలు తీసుకోవాలి.
- Gr-III నుండి MPHA (F) తరువాత GNM గా స్టాఫ్ నర్సు అంటున్నారు ఆ విధంగా కాకుండా ట్రైనింగ్ పూర్తి చేసిన అందరికీ promotion కల్పించాలి.
- 24 గంటలు పనిచేసే ఆసుపత్రులలో 4వ staff nurse ఏర్పాటు చేయాలి తద్వారా వీరికి అవకాశం లభిస్తుంది.
- GNM training పూర్తిచేసిన వారికి staff nurse పోస్టు పొందాలి అంటే 2 స్టెప్స్ దాటవలసి వస్తుంది కావున Appointment by transfer విధానం అవలంభించడం ద్వారా న్యాయం చేయాలి.
- డిపార్ట్మెంట్లో ఎప్పటికే తమ సొంత ఖర్చులతో GNM ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి కూడా ప్రాధాన్యత కల్పించాలి. అని వివరించడం జరిగింది.
దీని పైన స్పందించిన CFW గారు మరియు ఇతర అధికారులు.
- భవిష్యత్తులో మరల ఈ విధంగా GNM ట్రైనింగ్ ఇవ్వడం అనేది కుదరదు అని తేల్చి చెప్పినారు.
- 2400మంది GNM training కు join అవ్వగా 300 మంది HS pramotion రావడం వలన వెళ్లి పోయినారు ప్రస్తుతం 2100 మంది ట్రైనింగ్ పూర్తి చేసారు.
- GNM ట్రైనింగ్ పొందిన అభ్యర్థులు INC Norms ప్రకారంగా ఎన్ని గంటలు అయితే రెగ్యులర్ GNM వారు ట్రైనింగ్ పూర్తి చేయాలో అన్ని గంటల ట్రైనింగ్ ని పొందటం జరిగింది.
- PHC లో ఖాళీల నింపటానికి మొదట ప్రాధాన్యత ఇస్తాము. కానీ DME లో ఎక్కువ ఖాళీలు వున్నాయి ఈ విషయం పై అధికారులతో చర్చిస్తాము.
- అయితే GNM ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు స్టాఫ్ నర్స్ వెళ్లడానికి మొదట తమ willingness తెలియచేయాలి.
- Timebound అనేది ఇవ్వడం ద్వారా వీరంతా ఖచ్చితంగా ఒక నిర్దిష్ట సమయంలోపుగా స్టాఫ్ నర్స్ గా వెళ్ళటం జరుగుతుంది.
- Adhoc Rules మార్పు చేసే అంశం పరిశీలిస్తున్నాము.
- 3HOD ల వారు (DPHFW,DME &APVVP) విడిగా ఉద్యోగులకు ఇవ్వవలసిన Ratio తెలియ చేయాలి.
- కోర్టు కేసులను త్వరగా పరిశీలించి ఈ సమస్యకు ముగింపు పలకటానికి ప్రయత్నం చేస్తాము. అని CFW గారు తెలియచేశారు.

1 Comments
👍🙏🙏🙏🙏👍👍👍👍👍👍👋👋👋👋👋👋
ReplyDelete