Ticker

6/recent/ticker-posts

హెల్త్ కార్డులు ఉద్యోగులు /పెన్షనర్లుకు ఉపయోగపడేలా ఉండాలి. బొప్పరాజు

👉 *హెల్త్ కార్డులు ఉద్యోగులు /పెన్షనర్లుకు ఉపయోగపడేలా ఉండాలి... బొప్పరాజు.*

👉 నేటికీ పూర్తి స్థాయిలో అమలుకాని *ఎంప్లాయీస్ హెల్త్ స్కీం* తో తీవ్ర అవస్థలు పడుతున్న ఉద్యోగులు/పెన్షనర్లు.

👉 ఇ.హెచ్.యస్ ద్వారా సరైన చికిత్సలు అందాలంటే నెట్ వర్కుఆసుపత్రుల యాజమాన్యలకు సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి

అలాగే వారి విజ్ఞప్తులను కూడా పరిష్కరించితేనే సరైన వైద్యసౌకర్యాలు అందుతాయి.
       *** 
     ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ద్వారా చికిత్సలు పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు,పెన్షనర్లు నెల వారీ చందా చెల్లిస్తున్నప్పటికీ ఇప్పటికీ సరైన, పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందక
ఉద్యోగులు, ప్రధానంగా పెన్షనర్లు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, ఈ విషయాలను గౌ||మంత్రి వర్గ ఉప సంఘం, ఉన్నతాధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకుని పోయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పటికైనా ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్ లెస్ ట్రిట్ మెంటు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని
సోమవారం ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ మీద CEO గారితో జరిగిన సమావేశం లో  
ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ శ్రీ.బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిమాండ్ చేసారు.

♦️ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు,పెన్షనర్లు ఈ 
ఇ హెచ్.యస్ స్కీమ్ కు సొంత డబ్బులు చెల్లిస్తున్నప్పటికి, ఉద్యోగులు, పెన్షనర్లకు (ఇ.హెచ్.యస్) వైద్యసేవలు నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని ఆవేధన వ్యక్తపరిచారు.

♦️ ఉద్యోగులకు, పెన్షనర్లకు వైద్య సౌకర్యాలు ఈ ఇ.హెచ్.యస్ ద్వారా అందించక పోవడానికీ కారణం నెట్ వర్కు ఆసుపత్రులకు ప్రతినెలా చెల్లించాల్సిన బిల్లులు సక్రమంగా ప్రభుత్వం సకాలంలో చెల్లిండంలేదని, ధీనికారణంగానే ఇ.హెచ్.యస్. పై వైద్యసౌకర్యాలు అందించడంలేదు.

♦️ అంతేకాకుoడా అత్యవసరవైధ్యసౌకర్యాలు, ప్ర మాదాలు జరిగినప్పుడు కూడా వైద్యసౌకర్యాలు అందక ఇబ్బందులు పడే పరిస్దుతులు ఉన్నాయని బొప్పరాజు తెలిపారు.

♦️ ఉద్యోగులు,పెన్షనర్లు సంక్షేమంలో బాగంగా దీనిపై ప్రత్యేక శ్రద్ద చూపించి, ఈ సమస్యలను అధిగమించేందుకు అవసరమైతే పెరుగుతున్న దరలకు అనుగుణంగా ప్రతిసంవత్సరం నెట్ వర్క్ ఆసుపత్రులతో సమావేశాలు జరిపి ఇ.హెచ్.యస్.కేసులకు బిల్లులు టారిఫ్ లను మార్చుకొనేలా ఒప్పందాలు చేసుకొని ఉద్యోగులకు పెన్సనర్లకు సరైన వైధ్యసౌకర్యాలు క్యాష్ లెస్ పద్దతిలో అందేలా చూడాలని అవసరమైతే *ఉద్యోగసంఘలతో గౌ ||ముఖ్యమంత్రి గారి సమక్షంలో తక్షణమే ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈసమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు* .

♦️ జిల్లా స్థాయి లో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఐనా హెల్త్ కార్డ్స్ పై సమావేశములో ఏర్పాటు చేయాలని తెలియచేసారు. 

♦️మెడికల్ రియింబర్స్మెంట్ట్ గడువు 31.03.2024తో ముగుస్తున్నoదున దానిని తక్షణమే పొడిగించాలని కొరియున్నరు.

ఈసమావేశంలో కె.రమేష్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఈశ్వర్ డొప్పలపూడి ఆర్గనేజింగ్ సెక్రెటరీ ఏపీ జేఏసీ అమరావతి, k.శ్రీనివాసరావు డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మల్లేశ్వరరావు, క్లాస్ ఫోర్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు, పుల్లయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, D.శ్రీనివాస్ Ntr జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు, తధితరులు పాల్గొన్నారు.

ధన్యవాదాలతో...

బొప్పరాజు &
పలి శెట్టి దామోదర్ రావు.

Post a Comment

0 Comments