ఇరవై రెండేళ్ళ క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాను. నాలుగు ప్రభుత్వాలు , ఐదు మంది సీఎం లు మారారు. ఎవరూ మాగురించి పట్టించుకోలేదు. ఎన్నో పోరాటాలు చేసి చేసి అలసి పోయాం. ఇప్పుడు కూడా అవుతుందో కాదో అనుకునేంతలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని వంశోద్దారకుడు సీఎం జగన్ మా కోరిక నెరవేర్చాడు.
నా ఉద్యోగం రెగ్యులర్ కోసం దేవుని ప్రార్థించిన అమ్మకు , కుటుంబ సభ్యులకు, నాతో పాటు పోరాడి అలసిపోయిన మిత్రులకు , ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాలలో మద్దతు తెలిపిన అన్ని సంఘాల నాయకులకు , చివరిలో regular process upload చేసిన అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బందికి , ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ...! 🙏
ఈ కాంట్రాక్ట్ ప్రస్థానంలో రెగ్యులర్ కాలేక మానసిక క్షోభతో అశువులు బాసి అమరులైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా తోటి కాంట్రాక్ట్ సోదరులకు నివాళిగా ఈ విజయం వారికి అంకితం ఇస్తున్నాను...!!
*చివరిగా ఒక్కమాట..!!*
మా జీవితాలలో వెలుగులు నింపిన డైనమిక్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో మా ఇంట్లో దేవుడి ఫోటో పక్కనే ఎప్పటికీ ఉంటుంది.
*Thank you CM sir* 💖
*- JOHNNY*
*అనంతపురం*
0 Comments