Ticker

6/recent/ticker-posts

క్రమబద్ధికరణకు కృతజ్ఞతలు. APHAMSA

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించి ప్రతిరోజూ అన్ని శాఖల సెక్రటరిలతో చర్చలు జరుపుతూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూ.చ తప్పకుండా అమలుపరచడంలో ఏమాత్రం వెనుకాడకుండా ఎన్నికల కోడ్ నుండి సంరక్షించి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో, సెలవులలో కూడా నిరంతరం అధికారులను సిబ్బందిని పరుగులు పెట్టించి పనిచేయించి తన గొప్పదనాన్ని చాటుకున్న మహా గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందిన అంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గౌరవ శ్రీ KS జవహర్ రెడ్డి గారిని దుశ్శలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న "ఏపి హంస" అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అరవ పాల్ మరియు వారి బృందం...

ఈ సందర్భగా రాష్త్ర అద్యక్షులు శ్రీ అరవ పాల్ గారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతూ...

> 20 సం. ల కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కల అన్ని శాఖల కన్నా ముందుగానే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నెరవేర్చ గలిగినందుకు, రాష్ట్రంలోని ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి మాట ఇచ్చి చట్టం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, భేషజాలకు పోకుండా అధికారుల్ని సమన్వయ పరిచి ఎంతో పారదర్శకంగా వ్యవహరించిన చీఫ్ సెక్రటరీ గౌరవ శ్రీ కె యస్ జవహర్ రెడ్డి గారిని తమ మనస్సులో, కుటుంబాలలో సమాజంలో అత్యున్నతంగా అగ్రభాగాన ఆదర్శవంతమైన పరిపాలనను మెచ్చుకుంటున్నారు అని తెలియజేశారు

> అదేవిధంగా ఇతర శాఖలలో కూడా ముఖ్యంగా విద్యాశాఖ, పాలిటెక్నిక్ తదితర శాఖలలో సాంకేతిక లోపాలతో, అధికారులకు అవగాహన లేక ఆగిపోయిన కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేసి శేషం లేకుండా సంక్లిష్టతో కూడిన ఈ పనిని సంపూర్తిగా పూర్తి చేయాలనీ మనవి చేయడం జరిగింది...
అందుకు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాన్ని పూర్తి చేసి తీరుతాం, అవసరమైతే చట్టంలో మార్పులు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు 

హామీ ఇచ్చిన మిగిలిన 1207 లో ఉన్న మెరిట్, డిమెరిట్ లో మిగిలి వున్న 966 మంది వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మనవి చేయడం జరిగింది 

ఈ సంద్భంగా AP HAMSA అసోసియేషన్ ప్రభుత్వ గుర్తింపు కొరకు తన వంతు పాత్రగా కృషిచేసిన గౌరవ ప్రభుత్వ ప్రధాకార్యదర్శి శ్రీ కె యస్ జవహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది వారి చేతుల మీదగా G.o.Ms.No.24 ను తీసుకోవడంజరిగింది.... ఈ కార్యక్రమంలో ఏపి హంస అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బి రఘుబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, నాయకులు పిచ్చేశ్వరారావు, లింగన్న, శేషు, శివ శంకర్, మహిళ నాయకులు వెంకట రమణ...మరియు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ నాయకులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments