Ticker

6/recent/ticker-posts

CPS వచ్చే వరకు ఉద్యమం

 


పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జాతీయ పెన్షన్ పథకం (ఎన్ఎస్)పై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి ఈ మేరకు ఆయా సంఘాలు వినతి పత్రాలను అందించాయి. అంతేకాక ఆర్థిక శాఖ కార్యదర్శికి కూడా ఓ లేఖను అందజేశాయి. 2004 జనవరి 1వ తేదీ తర్వాత నియమితులైన ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ఎన్పీఎస్ ను ఉపసంహరించుకోవాలని, వారికి జిపిఎఫ్ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్పిఎస్ పథకాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగుల పెన్షన్ మార్కెట్ అస్థిరతకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించాయి. నూతన పథకం ప్రారంభమైన 2003 నుండి దానిని వ్యతిరేకిస్తూనే ఉన్నామని గుర్తు చేశాయి. ఎన్పీఎస్ అమలు కారణంగా పదవీవిరమణ చేసిన ఉద్యోగుల సామాజిక, వృద్ధాప్య భద్రతకు ప్రమాదం ఏర్పడిందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. 2007లో జరిగిన జాతీయ మండలి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇచ్చిన లిఖితపూర్వక హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆ సంఘాలు విమర్శించాయి.

విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎపి సిపిఎస్ఇఎ, ఎపిసిపిఎస్ యుఎస్, ఎపిసిపిఎస్ఇ, ఎపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేతలు ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రెండు సిపిఎస్ సంఘాలుగా ఉన్న ఎపిసిపిఎఎ, ఎపిసిపిఎస్ యుఎస్ కలిసి ఐక్యంగా ఎపి సిపిఎఎగా కొనసాగాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. అనంతరం రెండు సంఘాలు కలిసి ఉమ్మడిగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. నేడు ఉద్యోగు లను మోసం చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పారని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
జగన్ ను అభినందనలతో ముంచె త్తిన ఉద్యోగ ఐకాస నేతలకు ముందుగా జీపీఎస్ అమలు చేసి, అది విజ యవంతమయ్యాకే మిగిలిన ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులెవరూ జీపీఎస్ ను ఒప్పుకోవడం లేదని, ఓపీ ఎస్ సాధనకు పోరాడుతున్న సంఘాలన్నీ ఐక్య పోరాటం చేయాలని నిర్ణ యించారు.
ఆదివారం విజయవాడలో నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగ సంఘాల సమావేశంలో ఏపీసీపీఎస్ కార్యదర్శి బాజీపఠాన్ మాట్లా డారు. సీపీఎస్ రద్దుకు ఉద్యమించేందుకు ఏపీసీపీఎస్ స్ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్, సెక్రటరీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
'ఉమ్మడి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 19, 26 తేదీల్లో స్పందన కార్యక్రమాల్లో సీపీఎస్ పై రెఫరెండం నిర్వహిస్తాం. వైకాపా మేనిఫెస్టోను అమలు చేయాలని ఫిర్యాదు చేస్తాం. జులై 8న అన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి, ధర్నాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తాం' అని బాజీపఠాన్ తెలిపారు.
జేఏసీ నేతల్లో సీపీఎస్ ఉద్యోగి లేరని, వారంతా ప్రభుత్వానికి భజన చేస్తున్నారని మండిపడ్డారు. CPSకు వ్యతిరేకంగా మాట్లాడితే జేఏసీ నేతలను తరిమికొడతామని హెచ్చరించారు. ఏపీ సీపీఎస్ స్ఈఏ అధ్యక్షుడు రాంనర్సింహ మాట్లాడుతూ ఓపీఎస్ సాధనకు ఉమ్మడి పోరాటం చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ దాస్ మాట్లాడుతూ 'జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వం మా మాట వినలేదు. మా డిమాండ్ల సాధనకు ప్రజాపోరాటం చేస్తాం. ఆర్టీసీ, తితిదే, సచివాలయంతో సహా అన్ని విభాగాల ఉద్యోగులతో కలిసి ఆందో ళనలు ఉద్ధృతం చేస్తామ'ని ప్రకటించారు. జేఏసీ నేతలు స్వార్థం కోసం పని చేస్తున్నారని, సీపీఎస్ ఉద్యోగి ఎవరూ ఇప్పుడున్న నాలుగు జేఏసీల్లో సభ్యులు కారని సీపీఎస్ పోరాట సంఘం నాయకుడు రాజేశ్వరరావు గుర్తుచేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ జేఏసీ నేతలు తమపై విమర్శలు చేయడం సరికాదని, సీపీ ఎస్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎపిసిపిఎస్ యుఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్సి రామనరసింహ, కరిమి రాజేశ్వరరావు, సచివాలయ సిపిఎస్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేష్, వెంకటేష్, ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. అన్ని సంఘాల సమన్వయ కర్తగా బాజీపఠాన్ వ్యవహరించారు.

Post a Comment

0 Comments