Ticker

6/recent/ticker-posts

పదోన్నతులు కల్పించిన తర్వాతే సర్దుబాటు చేయాలి

జాతీయ ఆరోగ్య విధానం అమలులో PHC ప్యాట్రన్ మేరకు పోస్టులు మంజూరు చేశాక వాటిని feeder catagory తో భర్తీ చేస్తే ... ఎవ్వరూ లేవాల్సిన అవసరం లేదు...మొన్నటి దాకా విద్యా శాఖలో జరిగింది ఇదే మరి జాతీయ విద్యా విధానం NEP మేరకు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు పాఠశాలలు పెట్టారు/తీశారు అలాగే అందులోని పిల్లల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు పెట్టారు/తీశారు అవసరం మేర స్కూల్ అసిస్టెంట్ /HM పోస్టుల ను పదోన్నతులు ఇచ్చి భర్తీ చేశారు. అయితే  వైద్య ఆరోగ్య  శాఖలో కూడా జాతీయ ఆరోగ్య విధానం మేరకు వారి IPHS గైడ్లైన్స్ ను అమలు చేయడం లో అధికారులు విఫలం అయ్యారు అని చెప్పక తప్పదు.


రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థలు(SC,PHC,CHC,AH,DH,GGH, TEACHING HOSPITAL ) యొక్క infrastructure, HR క్రమంగా ఉండాలి అది జనాభా ఆధారంగా ఉండాలి తగు ప్రతిపాదనలు ఇవ్వవలసిన అధికారులు (ఉన్న వాటికి అదనంగా) ఆ మేరకు చేయడంలో విఫలం చెందారు.

మిగతా విషయాలు గురించి తరువాత మాట్లాడినా, ప్రస్తుతం జనాభా మేర ఎన్ని ఆసుపత్రులు ఉండాలి అనే సంఖ్యకు ఉన్న CHC లు ప్రత్యామ్నాయం చూపి ( GO 131 ద్వారా మంజూరైన 178లో 90 PHC లను వెనక్కి తీసుకున్నారు(అంటే డిసెంబర్ లో మొదలు పెడతాం అని మొన్నటిదాకా చెప్పారు అంటే ఇప్పటికే అక్కడ PHC లు కట్టి ఉండాలి ఇప్పుడు అవి సగం కట్టినవి రద్దు అయ్యాయా?) ప్రతి SC లో, PHC లో కనీసం ఉండాల్సిన సిబ్బంది /సౌకర్యాలు/ప్రజలకు అందే సేవలు ఇవన్నీ గైడ్లైన్స్ మేరకే (కొత్త sc, PHC లు, ANM,MLHP/DOCTORS, LT, Pharmacist, FNO, MNO... ఇలా దాదాపు 45000 పోస్టులను భర్తీ చేస్తున్నప్పుడు SC ల కన్నా MPHA/ANM లు ఎక్కువ మంది ఉన్నారని సర్దుబాటు కోసం పదోన్నతులు/gnm ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, అదే నిబంధన మేర ప్రతి రెండు HWC (SC) లకు MPHA (M) పోస్టు భర్తీ చేయాలి, దుర్మార్గంగా 4-12 సెంటర్లకు ఒక MPHA (M)ను మ్యాప్ చేసి అక్కడ స్టాఫ్ ఉన్నట్లు చూపుతూ కేంద్రాన్ని మభ్య పెడుతున్నారు.

రేషనలైజేషన్ అంటే సిబ్బంది ఎక్కువ అయితే సర్దుబాటు చేయడం ఒక్కటేనా? ప్రతి PHC కి ఇద్దరు Doctors కావాలి, 3 SN కావాలి అంటే నియామకాలు చేసినట్లు ప్రతి PHC కి ఒక CHO ఉండాలి కదా అందుకు తెప్పించుకున్నది సంఖ్యా నివేదిక మేర ఇంకా 399 CHO పోస్టులు మంజూరు చేయాలి...ఇలా చేస్తే 399 MPHEO/PHN లకు CHO అయిపోతారు... ఆ ఖాలీలలో MPHS(M.F) లకు MPHEO/PHN పదొన్నతి ద్వారా లబ్ది జరుగుతుంది...ఇక మిగులు సిబ్బంది అసలు ఉండరు.

20 సం నుంచి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న MPHA/LT PHARMACIST లను క్రమబద్దీకరణ చేసి కింది స్థాయి అన్ని పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. 

రాష్ట్ర ప్రభుత్వం మన మీద ప్రేమతో చేయడం లేదు.. NHP 2017 మరియు IPHS 2022 మేరకు... ఆ క్రమంలోనే 45000 పోస్టులు భర్తీ చేశారు అనేది గుర్తించుకోవాలి.

జనాభా ఆధారంగా సంస్థలు/సిబ్బంది ఏర్పాటు చేయాల్సిన తప్పని పరిస్తితి..ఉన్న సిబ్బందినే ప్రభుత్వం ఒక స్టాండర్డ్ మూసలో సర్దుబాటు చేస్తున్నప్పుడు... అది హేతుబద్దంగా ఉండాలి.

వారు రాష్ట్ర వ్యాప్తంగా డేటా తెప్పించుకుని చెప్పిన పద్దతిలోనే ...

1. PHC కి 14 మంది సిబ్బంది తప్పని సరి(ఎక్కువ ఉన్నవారిని తీసేస్తామని అన్నప్పుడు తక్కువ అయితే మంజూరు చేయాలి)

2.ప్రతి పోస్టు ఖాళీగా ఉండరాదు(ఏదైనా పోస్ట్ ఖాళీగా ఉంటే IPHS సర్టిఫికేషన్ రాదు) అంటే పదోన్నతులు ఇవ్వక తప్పని పరిస్తితి.

3. ఫీడర్ కేటగిరీ లో MPHA (F) భర్తీ చేసినప్పుడు... అదే IPHS గై్లైన్స్ మేరకు ప్రతి రెండు ఉప కేంద్రాలకు ఒక MPHA (M) నియామకం తప్పని సరి ... అయితే ప్రభుత్వం అలా చేయకుండా ఉన్న వారినే 4-12 SC లను వారికి మాపింగ్ చేసింది(ఇలా map చేయకపోతే IPHS సర్టిఫికేషన్ రాదు)

PHC కి ఒకటి చొప్పున సర్దుబాటు చేసినా ఇంకా CHO కేడర్ 400 అవసరం అదనంగా మిగులు గా ఉన్న PHN/MPHEO/ లను పై CHO ఖాలిల్లో పదోన్నతి ఇస్తే ... 400 మంది CHO లు అయిపోతారు...


💥 MPHEO /PHN లకు పదోన్నతులు ఇచ్చి అన్ని పోస్టులు మంజూరు చేయాలి కదా! ఇందులో డివిజన్ కొక/జిల్లాకు ఒక గ్రాడ్యుయేట్(DPHO) CHO పోస్టు మంజూరు చేయాలి.

400 CHO పోస్టులలో/ ఖాలిలల్లో పదోన్నతి పొంది MPHEO/PHN లు వెళితే consequent గా ఏర్పడే ఖాలిలల్లో మిగులు HS M/F లు పదోన్నతి పొందితే ఇక శాఖలో మిగులు సిబ్బంది అందరూ సర్దుబాటు అవుతారు..

కాబట్టి అవసరమైన పోస్టులు మంజూరు చేయడం కోసం మిగులు పోస్టులను up grade చేయడం వల్ల పెద్దగా నష్టం లేదు. నిజానికి ఇదే కదా హేతుబద్ధత...

ఇలా పదోన్నతుల ద్వారా పై పోస్టులు భర్తీ చేశాక చివరికి సర్దుబాటు కౌన్సిలింగ్ చేయాలి ఇదే నిజమైన హేతుబద్ధీకరణ.

- ఆస్కార్ రావు



Post a Comment

0 Comments