Ticker

6/recent/ticker-posts

ఆశ కార్యకర్తలకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కొరకు కరపత్రము

 

వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

"ఆశ కార్యకర్తల" అవగాహన కొరకు కరపత్రము

మన రాష్ట్రాన్ని కుష్ఠు రహితం చేద్దాం!
చేతులు కలుపుదాం! - కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం!!

1.కుష్టువ్యాధి అనగా నేమి?

కుష్టువ్యాధి మైకోబక్టిరియం లెప్రే (Mycobacterium leprae) అనే సుక్ష్మ క్రిమి ద్వారా సోకే దీర్గకాలిక అంటు వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మము మరియు నరములకు సోకుతుంది. ఈ వ్యాధి కారక క్రిమిని నార్వే దేశానికి చెందిన Dr. హన్సన్ అను శాస్త్రవేత్త 1873 లో కనుగొన్నాడు. కుష్టు వ్యాధి మైక్రో బాక్టీరియం లెప్రే అను బాక్టీరియా వలన వస్తుంది. ఈ క్రిములు తుమ్మడం వలన, దగ్గడం వలన వ్యాప్తి చెందుతాయి. వ్యాధి లక్షణాలు కనిపించుటకు 3 నుండి 5 సం॥లు పట్టవచ్చు.

 2. కుష్టువ్యాధి లక్షణాలు

1.       స్పర్శలేని మచ్చి

2.      ముఖము, చెవులు, ఎద, వీపు మీద నాష్పిలేని బుడిపెలు 

3.      కనురెప్పలు, కనుబొమ్మలు రాలిపోవుట

4.      కాళ్ళు చేతులు, తిమ్ముర్లు / వాపులు

5.      ముక్కుదూలం అడిగిపోవుట, గాలి ఆడకపోవుట 

6.      బాటన వ్రేలు, చిటికెన వ్రేలు, మణికట్టు పనిచేయకపోవడం ,

7.      కాలి వ్రేళ్ళు నేలకు రాసుకోవడం

8.      పాదాలు, చేతులపై బాబ్బలు రావటం

 3. కుష్టు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ?

వ్యాధి గ్రస్తుడైన చికిత్స పొందని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి గ్రస్తుడు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలుబడే తుంపర్ల ద్వారా (droplet infection) ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. కుటుంబములో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన కుటుంబ సబ్యులకు అందరికీ ఈ వ్యాధి రాదు. ఇతర అంటు వ్యాధులవలె కుష్టువ్యాధి వేగంగా మరొకరికి సోకదు. మనలో జన్మతహ వున్నవ్యాధి నిరోధక శక్తి వలన దాదాపు 90 శాతము మంది ఈ వ్యాధికి గురి కారు. కుష్టు వ్యాధి కి సంభందించిన క్రిమి శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు బయట పడడానికి దాదాపు రెండు నుంచి ఐదు సంవత్సరాల కాలము పడుతుంది (incubation period)

 4. కుష్టువ్యాధిగా ఎప్పుడు అనుమానించాలి?

ఈ వ్యాధి నిర్ధారణ కొరకు అనుమానిత వ్యక్తిని క్రింది లక్షణాల కొరకు వెలుతురు ఉన్న చోట పరీక్షించాలి.

ఎ. చర్మముపై మచ్చ :

         ·            శరీరంలోని ఏ భాగములోనైనా ఒకటి లేదా ఎక్కువ, చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి/ ఎరుపు రంగు ఉన్నప్పుడు. "

         ·            ఆ మచ్చలపై స్పర్శజ్ఞానము లేనప్పుడు మరియు నొప్పి తెలియనపుడు. మచ్చలపై చెమట పట్టదు మరియు వెంట్రుకలు రాలిపోవును.

బి. చర్మముపై బుడిపె :

         ·            చర్మము పై బుడిపెలు ఉన్నపుడు, (ముఖ్యంగా చెవి తమ్మెలు, ముఖం, చేతులు, కాళ్ళపై)

         ·            చర్మము ఎర్రగా (కంది నట్లుగా), ముఖ్యంగా చెవులు, ముఖము, కాళ్లు, చేతులు మరియు శరీరము పై బుడిపెలు వుండడము,

 సి. అంగవైకల్యం మరియు గాయాలు :

         ·            కాళ్లు, చేతులు, ముఖము (నోటి, కళ్ళ) కండరాల బలహీనత మరియు వంకరగా ఉండడం

         ·            కాళ్ళు, చేతులు మరియు పాదాలలో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారి తీయుట

         ·            పాదములలో గాయలు ఏర్పడుట.

         ·            కనురెప్ప పూర్తిగా మూయలేక పోవుట.

         ·            నరములు ఉబ్బినట్టుగా ఉండి నొప్పిగా అనిపించడము

         ·            కళ్ళు సరిగా మూయ లేక పోవడం

         ·            దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడములో ఇబ్బంది కలిగి వుండడము

 పై లక్షణాలు ఉన్నట్లయితే (మచ్చలు, బుడిపెలు, అంగవైకల్యము ) ఆ వ్యక్తిని కుష్టువ్యాధి నిర్ధారణ కొరకు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు పంపవలెను. ఉదా: కాలికి వేసుకున్న చెప్పులు మాటిమాటికి జారిపోవడము, పెన్ను, వంట పాత్రలు, కొడవలి, పరక వంటి వస్తువులు సరిగా పట్టుకోలేక పోవడము, వంట చేసే సమయములో అర చేతులకు తెలియకుండానే బొబ్బలు రావడము లేక ఎక్కువ దూరము నడచి నప్పుడు తెలియకుండానే అరికాలి ఫై బొబ్బలు రావడము ఆ బొబ్బలు నొప్పిగా అనిపించకుండా వుండడము, ఫైన చెప్పబడిన లక్షణాలు ఏ వ్యక్తి లోనైన మీరు చూచినట్లైతే, వ్యాధి నిర్ధారణ కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములోని వైద్యుని లేదా సంబంధిత ఆశా కార్యకర్తను గాని, ఆరోగ్య కార్యకర్తను గాని సంప్రదించమని తెలియజేయండి

 5. కుష్టువ్యాధి చికిత్స వర్గీకరణ?

         ·            పాసీబ్యాసిల్లరీ (పి.బి) - 1 నుండి 5 మచ్చలు ఉన్నట్లయితే ( Pauci Bacillary) ఒక నరము మాత్రమే జబ్బుకు గురి అయి ఉబ్బినట్టు వుండడము లేక ఒక్క నరము కూడా ఉబ్బి ఉండక పోవడము.

         ·            మల్టీబ్యాసిల్లరీ (యం.బి) - 5 కంటే ఎక్కువ మచ్చలు ఉన్నట్లయితే ( Multi Bacillary) ఒకటి లేక అంతకంటే ఎక్కువ నరములు జబ్బుకు గురి అయి ఉబ్బినట్టు వుండడము

 6. కుష్టువ్యాధి నయమౌతుందా?

         ·            చికిత్స సక్రమంగా తీసుకుంటే కుష్టువ్యాధి ఏదశలో ఉన్నా బహుళ ఔషద చికిత్సతో ( Multi Drug Treatment ) సక్రమంగా తీసుకొన్నట్లయితే, కుష్టువ్యాధి నయం అవుతుంది

 7. కుష్ఠువ్యాధికి చికిత్స ఎక్కడ లభ్యమవుతుంది?

కుష్టువ్యాధికి చికిత్స అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో ఉచితంగా లభించును

 8. కుష్ఠువ్యాధి చికిత్స విధానాలు

చికిత్సా కాలము

బహుళ ఔషధ పాకెట్

పాసిబ్యాసిల్లరీ (పి.బి) ఆరునెలల చికిత్స (కనీసం 9 నెలలో పూర్తి చేయాలి)

6మోతాదుల చికిత్స  పెద్దలకు / చిన్న పిల్లలకు

 

మల్టీబ్యాసిల్లరీ (యం.బి) 12 నెలల చికిత్స (కనీసం 18 నెలలో పూర్తి చేయాలి)

12మోతాదుల చికిత్స  పెద్దలకు / చిన్న పిల్లలకు

 

Multi Drug Therapy (MDT)

        ·            Highly effective cure

        ·            Combination of 2-3 drugs:

        ·            Clofazimine, Rifampidin, Duapsone

        ·            Cun paident in 6 month(Pa)/12 month(MB)

        ·            Kill the leprabacilli and stop transmission

        ·            Can be delivered without special waff and institution Available free of cost

(న్ని ప్రభుత్వ ఆసుపత్రులలో MDT మందులు పూర్తిగా ఉచితం. వైద్యునిచే వ్యాధి నిర్ధారణ అయిన పిదప్ మొదటి నెల వైద్యుని వద్ద, రెండవ నెల నుండి ఎ.ఎన్.ఎమ్. ద్వారా ఇంటి వద్దనే మందులు తీసుకొనవచ్చును. మందులు క్రమం తప్పకుండా వాడవలెను)

 9. ఎలా పర్యవేక్షించాలి

కుష్ఠువ్యాధికి చికిత్స తీసుకొంటున్న వ్యక్తులను ప్రతినెల “ఆశకార్యకర్త" సందర్శించి వార MDT చికిత్స తీసుకొను విధానమును తెలుసుకొనవలెను. చికిత్సక్రమం తప్పకుండా తీసుకోని లేదా చికిత్స మానివేసిన వ్యక్తులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి చికిత్స సక్రమంగా తీసుకొనునట్లు తోడ్పడాలి.

 10. కుష్టువ్యాధి వలన కలిగిన అంగవైకల్యం మరల సరిచేయవచ్చా ?

కుష్టువ్యాధి వలన అంగవైకల్యం పొందినవారి కోసము ప్రభుత్వము అంగవైకల్య నివారణ మరియు వైద్య పునరావాసము (Disability Prevention & Medical Rehabilitation - DPMR ) అను కార్య క్రము నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమము క్రింద అంగవైకల్యం పొందిన వారికి ఎంపిక చేసిన కొన్ని ఆసుపత్రులలో ఉచిత శస్త్ర చికిత్స నిర్వహించి ( ఉచిత భోజన, వసతి తో సహా ) రూ. 8000 ల ఆర్ధిక సహాయము కూడా అంద చేస్తారు.

 11. కుష్టు వ్యాధి వలన అంగవైకల్యము కలిగిన వారికీ చేతులు కళ్ళు మొద్దుబారి నట్టు వున్నా వారికీ స్వయం సంరక్షణ ఫై మనము ఏమి సలహా ఇవ్వవచ్చు?

·         చేతులు/పాదాలు స్పర్శజ్ఞానం లేనిచో ప్రతి రోజు నీటిలో 1/2 గంట ముంచి ఉంచాలి.

·         చేతులు/పాదాలు పొడిగా ఉన్నపుడు వంట నూనెను గాని వ్యాజీలైన్ పూయాలి.

·         చేతులను వేడి, రాపిడి నుండి పరిరక్షించాలి.

·         పాదాలకు మేకులు లేని యం.సి.ఆర్.తో చేసిన పాదరక్షలు ఉపయోగించాలి

·         గాయాలను క్రమంతప్పక సబ్బునీటితో శుభ్రపరచుకోవాలి.

·         నరాలు దెబ్బతినటం వలన కనురెప్పలు సరిగా మూసుకోననిచో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,

·         అద్దములో కళ్ళను పరీక్షించుకోవాలి అవసరమైనచో కళ్ళు ఆపరేషన్ చేయించుకొని సరిచేసుకోవాలి

 12. ఈ వ్యాధి పట్ల / వ్యాధి గ్రస్తులపట్ల మనము నిర్వహించవలసిన సామజిక భాద్యత ఏమిటి.?

కుష్టువ్యాధి అని అనుమానము ఉన్న వ్యక్తులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నకు పంపించవలెను కుష్టువ్యాధి గురించి అవగాహన మరియు పరిజ్ఞానము సమాజములో కలుగజేయాలి. కుష్టువ్యాధి చికిత్స తీసుకుంటున్న వారిని సక్రమముగా మందులు వాడునట్లు ప్రోత్సహించాలి కుష్టువ్యాధి సోకిన వారు మనలో ఒకరని సమాజములో భాగమని ఆ వ్యక్తి పట్ల ఎలాంటి వివక్ష తగదని ఇతరులకు తెలియచేయాలి. ప్రజలలో ఈ వ్యాధి పట్ల వున్నా మూఢ నమ్మకాలు, భయాలు, అపోహలు తొలగించడానికి నిర్వహించు ప్రత్యెక శిభిరములలో అవగాహన సదస్సుల లోనూ భాగస్వాములు కావలెను

 13. కుష్ఠువ్యాధి నివారణలో “ఆశ కార్యకర్త" విధులు.

·         కుష్ఠువ్యాధి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలి.

·         కుష్ఠువ్యాధిగ్రస్తుల చికిత్స విధానమును పర్యవేక్షించాలి.

·         కుష్టువ్యాధి గ్రస్తులకు చికిత్స, జాగ్రత్తల గురించి సంప్రదింపు జరపాలి.

·         చికిత్సకాలంలో తగిన కౌన్సిలింగ్ వ్యాధి గ్రస్తులకు ఇవ్వాలి.

·         కుష్టువ్యాధి నివారణ కొరకు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనాలి.



 

Post a Comment

0 Comments