Ticker

6/recent/ticker-posts

ప్రభుత్వ ఉద్యోగులకు YSR CP కొత్త మేనిపోస్టో

ysr కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొంత అసహనం ఏర్పడుతున్న నేపెధ్యంలో YSR  కాంగ్రెస్ మేనిపోస్టో  చెప్పబడుతున్న ఈ క్రింది పొస్ట్ కొంత విస్మయానికి గురిచేసింది.
  • సి.పి.ఎస్ రద్దు చేస్తాం.
  • పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం . 
  • ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 % IR ఇస్తాం . అంతేకాదు సకాలంలో PRC అమలు పరుస్తాం . 
  • ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం . 
  • అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత , సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం . ( సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే టైమ్ స్కేల్ను అమలు చేశాం . రిటైర్ అయ్యాక కూడా ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉండేందుకు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కమిటీ వేశాం . ) 
  • సమాన పనికి సమాన వేతనం ' ప్రాతిపదికగా అవుట్ సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాం . (ఆశావర్కర్ల వేతనం రూ .3,000 నుంచి రూ . 10,000 లకు పెంపు . హోంగార్డులకు రూ .18,000 నుంచి రూ .21,000 లకు పెంపు . మధ్యాహ్నభోజన కార్మికుల వేతనం రూ .3,000 లకు పెంపు . వి.ఓ.ఏ , సంఘమిత్ర , యానిమేటర్ల జీతాలు రూ .10,000 లకు పెంచాం . బోధన ఆస్పత్రులు , ఏరియా ఆస్పత్రులు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోని పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ .8,000 ల నుంచి రూ . 16,000 లకు పెంపు . మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ . 12,000 ల నుంచి రూ . 18,000 లకు పెంచాం) 
  • పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం . 
  • పోలీసులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వీక్లీ ఆఫ్ను అమలు చేస్తాం .. 
  • సైనికులు , మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు / హక్కులు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు . వీటిని మారుస్తూ వీరికి గౌరవమిస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం . 
  • గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద ఆరాచకాలు పెరిగిపోయాయి . మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం . 
  • ప్రభుత్వ ఉద్యోగులకు , ఆయా ప్రాంతాలలో ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇస్తాం.


Post a Comment

0 Comments