మన జేఏసి కృషితో మన 100% గ్రాస్ శాలరీ విషయమై క్లారిటీ!ఈరోజు మన జే ఏ సి నాయకులు అమరావతి పర్యటనతో మన జీతాలు విషయంలో మనం 100% గ్రాస్ శాలరీకి అర్హులం అనే స్పష్టమైన సంకేతాలు మన ఉన్నతాధికారులు నుంచి వచ్చింది.ముఖ్యంగా, గౌరవ ముద్దాడ రవిచంద్ర గారిని "మన జేఏసి" కలిసి మన జీతాల సమస్య వివరించడంతో ముద్దాడ గారు ఎంతగానో స్పందిస్తూ.... మీరు మీ నియామక తీరు, మీకున్న అర్హతలు రైట్ తోనే మీకు అడుగుతున్నారు తప్పకుండా న్యాయం జరుగుతుందని మాటివ్వడం జరిగింది!
మన జేఏసి ఇచ్చిన వినతిపై తక్షణమే స్పందించి మనం పే+డీఏ+హెచ్ ఆర్ ఏ తో 100% గ్రాస్ శాలరీ కి మనం అర్హులమే అంటూ మనకు అన్ని విధాలా అనుకూలంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన మన డీ.హెచ్ మేడం గౌరవ హైమావతి గారు కూడా ఈరోజు మన జేఏసి నాయకులకు మంగళగిరిలో ముద్దాడ గారి కార్యాలయం దగ్గర అనూహ్యంగా కలవడం జరిగింది. మనందరి కోసం చక్కటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన డి.హెచ్ మేడం గార్కి మన జేఏసి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందనీ మేడం మనకు భరోసా ఇవ్వడం ఆనందదాయం!అదే విధంగా, సచివాలయంలో మన వైద్య ఆరోగ్యశాఖ సెక్షన్ అధికారులను మన జే ఏ సి కలిసిన సందర్భంలో వారు కూడా మన జీతాలు విషయంలో పాజిటివ్ గానే స్పందిస్తూ... మనకు సంభందించిన మరిన్ని వివరాలను మన జేఏసి నాయకుల నుంచి అడిగి తెలుసుకుని, మనకు న్యాయం జరిగేలా సహకరిస్తామని చెప్పారు. చివరిగా కొసమెరుపు...ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా, ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన గౌరవ చంద్రశేఖరరెడ్డి గారిని కూడా మన జేఏసి కలిసి మన జీతాలు సమస్య వివరించడంతో చంద్రశేఖరరెడ్డి గారు ఈ విషయంలో తమ వంతు సాయం అందించి త్వరితగతిన జీతాలను అందజేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామని మాటిచ్చారు.
ఏదిఏమైనా "మన జేఏసి" చేస్తున్న కృషి త్వరలోనే తప్పకుండా ఫలించి మనందరికీ మెరుగైన జీతాలు తప్పకుండా అందుతాయని...అప్పటివరకూ మన జేఏసి నిరంతరాయంగా తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది!!!
0 Comments