Ticker

6/recent/ticker-posts

ఇన్ సర్విస్ GNM నర్సింగ్ విద్యావ్యవస్థకు హానికరం

ఇన్ సర్విస్ GNM నర్సింగ్ విద్యావ్యవస్థకు హానికరం

వైద్య ఆరోగ్య శాఖలో MPHA(F)/ANM-III గా పనిచేస్తున్న వారికి ఇన్ సర్విస్ ట్రైనింగ్ గా  GNM కోర్సు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం  అనుమతి ఇచ్చింది. అలాంటి చర్య నర్సింగ్ విద్యావ్యవస్థకు హానికరం. భారతదేశంలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC) ద్వారా మాత్రమే GNM విద్యకు సిలబస్, కళాశాలల అనుమతి  మరియు సీట్లు సర్దుబాటు నిర్ధారించే అధికారం వుంది. మన విద్యావ్యవస్థలో ప్రభుత్వం పదో తరగతి తర్వాత రెండేళ్ల విద్యాభ్యాసం (Intermediate/Diploma) పూర్తయిన తర్వాతనే మూడేళ్ల కోర్సు (GNM డిగ్రీ) చదివే అవకాశం కల్పించింది. GNM సిలబస్‌కు సంబంధించి నర్సింగ్ ఎడ్యుకేషన్‌పై INC ఇప్పటికే ఒక విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన రెండేళ్ల కోర్సు INC మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. INC మార్గదర్శకాల ప్రకారం కొత్త కాలేజీలను స్థాపించడానికి మరియు కాలేజీలలో సీట్లను పెంచడానికి DMEకి అధికారం లేదు. ఇప్పుడు ప్రభుత్వం. GNM సర్టిఫికేట్‌లకు INC అనుమతి లేకుండా కోర్సులను ప్రారంభించింది. అందువల్ల, రెండేళ్ల GNM కోర్సుకు INC అనుమతి లేనందున వారు నర్సింగ్ కౌన్సిల్‌లోని రిజిస్ట్రేషన్  చేసుకోవడం కష్టం అవుతుంది. IPHS విధానం ప్రకారం TYPE - A మరియు TYPE - B ఆసుపత్రులలో ప్రభుత్వం అనాలోచితంగా నియమించిన 3732 MPHA (F) /ANM-IIIలను భర్తీ చేయడం వలన చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేయకుండా ఎక్కువగా వున్న MPHA/ANMలను ఇప్పటికే కాలిగా వున్న PHCలలో సర్దుబాటు చేసి కొత్త ఉద్యాగాలు కల్పిస్తే బాగుంటుంది అని GNM/BSc Nursing చదివి ఖాళీగా వున్న నిరుద్యోగులు వాపోయారు. 



Post a Comment

0 Comments