Ticker

6/recent/ticker-posts

రెండు సంవత్సరాల GNM ట్రైనింగ్ తో నష్టమే ..

ANMs అందరికి నమస్కారం
        GO No 5 గురించి ( అనగా ప్రస్తుతం సచివాలయం ANMs కాకుండా మిగిలిన అందరూ ANMs GNM Training కి వెళ్ళమని వచ్చిన GO) నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక నాకు తెలిసినంత వరకు మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.
             GO No 5 లో సరియైన వివరణ లేదు. ఈ Training కి Indian Nursing Council Permission లేదు. Indian Nursing Council Rules ప్రకారం GNM Training కావటానికి BiPC లో  Intermediate Qualification ఉండాలి మరియు ఈ Training కాలపరిమితి 3 సంవత్సరాలు. లేదా Regular ANM గా 10 సంవత్సరాల సర్వీసు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు In Service వారికి రాష్ట్రం మెుత్తం మీద 20 సీట్లు ఉన్నాయి అనుకుంటా! 10 సంవత్సరాల సర్వీసు కలిగి as for rules GNM Training కి వెళ్ళిన వారికి Vacancies ను బట్టీ వారికి Staff Nurse స్కేలు ఇస్తూ వారికి పోస్టింగు స్టాఫ్ నర్సుగా ఇస్తారు. కాని GO No 5 లో ఎటువంటి వివరణ ఇవ్వలేదు. Regular ANMs ఈ Training చేస్తే Sanction Post లలో నియమించుతారా లేదా! Staff Nurse స్కేలు ఇస్తారా లేదా? Promotion Chanel ఏమిటి అనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పుడు మీరు చేస్తున్న పోస్టులు అన్ని Sanction Post లు మీరు ఆ పోస్టుల్లో ఉన్నంత వరకు మీ పోస్టుకి గాని మీ ప్రమోషన్ కి గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. So నా అభిప్రాయం ప్రకారం Regular ANMs ఈ ట్రైనింగుకు వెళ్ళకపోవడమే మంచిది. ఇది నా అభిప్రాయం మాత్రమే.
             ఇక OP ANMs, Contract ANMs, యురోపియన్ ANMs, మరియు 2nd ANMs వీళ్ళు ఈ GNM Training కి వెళ్ళ వచ్చు, ఎందుకంటే మీకు సర్వీసు రూల్స్ లేవు కాబట్టి మీరు వెళ్ళ వచ్చు. మీకు ట్రైనింగ్ పిరయడ్ లో మీకు ఇప్పుడు ఇస్తున్న జీతం ఇస్తారు మరియు మీరు సర్వీసులో ఉండి ట్రైనింగ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఈలోపు  మిమ్మల్ని రెగ్యులర్ చేయాలనుకుంటే మీకు వెయిటేజ్ మార్కులు కలుస్తాయి కనుక మీ వరకు ఇబ్బంది లేదు. ట్రైనింగ్ అయిన తరువాత మిమ్మల్ని స్టాఫ్ నర్సులుగా తీసుకుంటే ఆ స్కేలు ప్రకారం మీకు ఎక్కువ జీతం వస్తుంది (ఇప్పటి వరకు మీరు చేసిన సర్వీసు కలిసే విధంగా చేసుకోవాలి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది)
              ఏప్రియల్ 2022 నుండి మార్చి 2024 వరకు ఈ కోర్సు ఉంటుంది. 2024 లో జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కనుక మీకు కోర్సు అయిన వెంటనే పోస్టింగ్ ఇవ్వరు. ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ వచ్చే వరకు మీరు మీ యెుక్క ఒరిజినల్ పోస్టులోనే Join కావలసి ఉంటుంది. So no problem.
             కొంత మంది Pass కాలేము అని భావించుచున్నారు, మీరు ANM ట్రైనింగ్ లేనే 75% కోర్సు నేర్చుకున్నారు కనుక ఇబ్బంది ఉండదు. In service వాళ్ళని తప్పకుండా Pass చేస్తారు. దీని గురించి మీరు ఆలోచించవలసిన పనిలేదు.
      
                              భానుమూర్తి.యం. 
  Guntur

Post a Comment

0 Comments