Ticker

6/recent/ticker-posts

CHO (F) ప్రమోషన్లలకు మార్గం సుగమం.

పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్::విజయవాడ వారు Rc.No: 0001568/E5B/2021 Dt:22.02.2022 ను ఫీడర్ కేడర్ PHN(NT) నుండి ప్రోమోషన్ కేటగిరీ CHO (F) గా ఇవ్వడానికి 2021-22 ప్యానెల్ సంవత్సరానికి  - ACR (Annual Confedential Reports) లు మరియు ఛార్జీలు పెండింగ్‌లో లేవు అనే సర్టిఫికెట్లను ప్రమోషన్ కోసం అర్హులైన వారు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.  
  DPHFW వారు 202-2022 ప్యానెల్ సంవత్సరానికి CHO(F) యొక్క ప్రమోషన్ పోస్ట్ కోసం PHN(NT) యొక్క సీనియారిటీ జాబితాను తయారుచేసారు.  రాష్ట్రంలోని నాలుగు RDM&HS ల నుండీ ACRలను అందించమని ఆదేశించారు. అయితే 12.02.2022 నాటికి  RDM&HS ల నుండి ప్రమోషన్ లిస్ట్లో  వున్న  PHN (NT) లకు సంభందించిన వారి ఛార్జీలు పెండిగులో లేవు అనే సర్టిఫికెట్లు అందలేదు.  అందువలన రాష్ట్రంలోని RDM&HS లు వెంటనే PHN(NT)కి సంబంధించి ACRలు మరియు పెండింగ్‌లో ఉన్న ఛార్జీలు లేని సర్టిఫికేట్‌లను 24.02.2022 తారీకు లోపు ప్రత్యేక మెసెంజర్‌తో వెంటనే సమర్పించవలసిందిగా అభ్యర్థించబడినట్లు సమాచారం.

పైన పేర్కొన్న తేదీలో సమాచారాన్ని సమర్పించకుంటే, సంబంధిత అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియచేసారు.  దీన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించాలని  Dr.G.హైమావతి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ వారు తెలియచేసారు. 

Post a Comment

0 Comments