Ticker

6/recent/ticker-posts

మరో కాంట్రాక్టు ఉద్యోగి మరణం

 

కర్నూలు జిల్లా వేల్పూరు ప్రాధమిక రోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ANM గా విధులు నిర్వహిస్తున్న M. బాలమ్మ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి సబ్-సెంటర్ కు Covid-వాక్సిన్ తీసుకు వెళుతుండగా జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు. ఈమె 2003 సంవత్సరంలో కాంట్రాక్ట్ పద్ధతిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు EC ANM భాద్యతలు చేపట్టారు. 
ఈమె మరణం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు అందరు దిగ్భ్రాంతికి గురయ్యారు, గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలు అందించి ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తాను అని చెబుతున్న తరుణంలో ఈ విధంగా జరగడం భాదాకరమని, గత ప్రభుత్వములో కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకునే విధంగా GO 25 ను తిసుకువచ్చినా సరైనా విధివిధానాలు లేకపోవడం వలన ఇప్పటి వరకు GO విడుదలైన తరువాత దాదాపు 40 మంది మరణించినా ఇంతవరకు ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇస్తానన్న ఆర్ధిక భరోసా ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. ఈ మరణంతో అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి కంత్ర్క్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. 
ఇటువంటి పరిస్థితి మారాలి అంటే రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను వెంటనే రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల JAC డిమాండ్ చేసింది. మరణించిన బాలామణి గారికి రావలసిన ఎక్స్గ్రేషియా తదితరులు వెంటనే అందే విధంగా అలాగే ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా అందకుండా ఉండిపోయిన కుటుంబాలకు కూడా ఈ మరణంతో అయినా కానీ ప్రభుత్వం స్పందించి చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల వారికి రావలసిన ఎక్స్గ్రేషియా వెంటనే అందించాలని అప్పటివరకు తామంతా పోరాటం చేస్తామని తెలియజేశారు. 

Post a Comment

0 Comments