Ticker

6/recent/ticker-posts

అవనిగడ్డలో కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఆందోళనలు



తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఆందోళనలు నేటికి 34వ రోజుకు చేరుకున్నాయి. నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన లో భాగంగా ఈరోజు అవనిగడ్డ లో నిరసన కార్యక్రమం జరిగింది.

DSC ద్వారా నియామకాలు జరిగి 20 సం. నుండి ఉద్యోగాలు చేస్తున్న తమను రెగ్యులర్ చేసే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ,కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించి వారికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ,YSRCP మ్యానిఫెస్టోలో పొందుపరిచిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీని ముఖ్యమంత్రి శ్రీ. జగన్మోహన్ రెడ్డి వెంటనే అమలుపర్చి తమ జీవితాలలో వెలుగు నింపాలని నినాదాలు చేస్తూ అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో........
పల్నాటి రాజబాబు
షఫీఉల్లా ఖాన్
నడికట్ల శ్రీను
జంపాన ఏడు కొండలు
పోతన శ్రీనివాసరావు
కణజం ఫణిజ
కోలపల్లి నరేంద్ర
చింతల శ్రీనివాసరావు
అప్పికట్ల తారక మస్తాన్ రావు
తుమ్మిడి మురళీ కృష్ణ
కొండవీటి హరిబాబు
భూపతి సుబ్రహ్మణ్యస్వామి
అవనిగడ్డ ప్రసాద్ బాబు
P. V. ప్రసాద్
K.జగన్
బోలెం వీరాస్వామి
V. నరసింహారావు
మత్తి.వాణీ కుమారి
మొదలగు అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి CITU తూర్పు క్రిష్ణా ఉపాధ్యక్షులు శీలం నారాయణరావు గారు సంఘీభావం తెలిపారు.


Post a Comment

0 Comments