* సగటు ఉద్యోగి ఆవేదన *
* గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ తెలియజేయుచుకుంటుంన్న విన్నపం *
*Sir మీరు పెంచిన 62 సంవత్సరముల సర్వీసు మాకు వద్దు , అలాగే మీరు పెంచిన 4 లక్షల గ్రాడ్యుటీ కూడా వద్దు సర్ ఎందుకంటే అర కొర చాలి చాలని జీతాలతో పాపం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వారు మరియు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చాలా బాధ పడుతున్నారు సర్ * * 2022 జనవరి నుండి 2023 డిసెంబరు రెండు సంవత్సరాల కాలంలో షుమారు 50,000 మంది రిటైర్మెంటు అవుతారు వీరికి గ్రాడ్యుటీ ద్వారా ఒక్కరికి పెంచిన 4 లక్షల రూపాలు చొప్పున 50 వేల మందికి 2 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి*
* అలాగే మీరు రెండు సంవత్సరాల సర్వీసు పెంచినందువలన ఒక్కొక్కరికి నెలకి లక్ష రూపాయలు ఇవ్వాలి ఇవి రెండు సంవత్సరాలకి కలిపి 500 కోట్ల రూపాయలు అవుతాయి*
* ఇంత చేసినా వీరు ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పని చేయలేరు. దీనికి బదులుగా ఒక ఉద్యోగికి ఇచ్చే లక్ష రూపాయలతో 4 గురు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించవచ్చు సర్ , వీరికి ఉద్యోగం కల్పించి వారి బ్రతుకుకి బరోసాని కలిగించండి *
* అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లలో పని చేసే ఉద్యోగులకు జీతాలు పెంచండి సర్*
*మీ మానస పుత్రికలైన గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు సర్, రెండు సంవత్సరాల క్రితం వారు మీ ద్వారా నియమించబడ్డారు.* * అప్పుడు 15,000/- జీతంతో నియమించబడ్డారు,రెండున్నరసంవత్సరాలు గడిచినా అదే 15,000/- రూపాయలతో పని చేస్తున్నారు. వంట నూనె 80/- లది 160/- అయ్యింది, పెట్రోల్ 75/- ది 115/- అయ్యింది, గ్యాసు 550/- ది 1000/- అయ్యింది ఇలా మార్కెట్ లో ప్రతి వస్తువు ఆరోజుకి ఈరోజుకి రెట్టింపు అయ్యింది కాని వారి జీతం మాత్రం 5 రూపాయలు కూడా పెరగలేదు*
* కనుక సర్ మేము హృదయపూర్వకంగా కోరుకొనేది ఏమిటంటే దయచేసి 62 సంవత్సరాలకి పెంచిన సర్వీసుని రద్దు చేయండి. మా కుంటుంబాలు, మా పిల్లలు ఏదో ఒక రకంగా స్థిరపడ్డారు పాపం నిరుద్యోగులకి అవకాశం కల్పించండి అలాగే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి జీతాలు పెంచండి సర్ వారు చాలా కష్టపడుతున్నారు.*
🙏 * దయతో మరొక్కసారి ఆలోచించి 62 సంవత్సరాల సర్వీసుని రద్దు చేసి చిన్న ఉద్యోగుల్ని మరియు నిరుద్యోగుల్ని ఆదుకుంటారని ప్రార్థించుచున్నాను.*
0 Comments