Ticker

6/recent/ticker-posts

ఉద్యమ నాయకులకు మనవి

ఉద్యమ నాయకులకు నాదొక మనవి, కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పదే పదే సాకు గా చూపుతూ, ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని చెబుతూ సామాన్య ప్రజలలో ఉద్యోగులను స్వార్ధపరులు గా చిత్రీకరిస్తూ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడం లో భాగంగా గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం మనకు బాకీ ఉన్న 5 డి ఎ లను మరియు మనము కష్టపడి దాచుకున్న జిపిఎఫ్, ఎన్ క్యాష్ మెంట్  ఆఫ్ ఈ ఎల్ మొదలైన చెల్లింపులు సంవత్సర కాలంగా పెండింగ్లో పెట్టిన వాటి వడ్డీలను నష్టపోతూ రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరిస్తూనే వస్తున్నారని, ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఎటువంటి శ్రమ పడకుండా ఉచితాలు గా పంచిపెట్టే సంక్షేమ పథకాలకు పరోక్షంగా సహకరిస్తూ వచ్చారని ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు ప్రభుత్వమే కుట్రపూరిత ధోరణితో తప్పుడు లెక్కలు చెబుతూ మోసగిస్తున్నది అన్న విషయాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా మీడియా ద్వారా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ విధానాలని ఎండగట్టాల్సి ఉంది. మనం గట్టిగా అడగవలసిన డిమాండ్లలో  ముఖ్యమైనవి పిఆర్సి ఫిట్మెంట్ 27% పైబడి ఇవ్వాలని, ప్రతి ఐదు సంవత్సరాలకి పే రివిజన్ ఉండాలని, పెన్షనర్స్ కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యధాతథంగా కొనసాగించాలని, హెచ్ ఆర్ ఏ మరియు సి సి ఏ లను యధాతధంగా కొనసాగించాలని,  కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం contingent ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని వెంటనే భర్తీ చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వలన కలిగిన సమస్యలు వెంటనే  పరిష్కరించాలని, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను వెంటనే క్రమబద్ధీకరించాలని,ఈ హెచ్ ఎస్ ద్వారా ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో పూర్తి నగదు రహిత ట్రీట్మెంట్ అందించాలని, ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని,  ఉద్యోగి మొదటిసారిగా గృహ నిర్మాణం చేసుకొనుటకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని మనవి.🙏🙏🙏
D V K Varma 

Post a Comment

0 Comments