ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిశు మరణాల రేటు 1000 సజీవ జననాలకు 39 మరియు నవజాత శిశు మరణాల రేటు 1000 సజీవ జననాలకు 33 మరియు 5సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు వున్న వారి మరణాల రేటు 1000 సజీవ జననాలకు 52గా ప్రస్తుతం వుంది. దానిని 2030 నాటికి శిశు మరణాల రేటు 1000 సజీవ జననాలకు 12 మరియు నవజాత శిశు మరణాల రేటు 1000 సజీవ జననాలకు 12 మరియు 5సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు వున్న వారి మరణాల రేటు 1000 సజీవ జననాలకు 25గా తగ్గించాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలకు 100% వ్యాధి నిరోధక టీకాలను వేయాలని లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం NHM (National Health Mission) నిర్దేశించిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశాల ఎంపిక జరిపించింది. సాధారణ ప్రమాణంగా ప్రతి 1000 జనాభాకు "ఒక ASHA"ఉండేలా ఏర్పాటు చేసారు. 50,000 మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ నివాసాలలో ప్రతి 2000-2500 జనాభాకు ఒక ASHA ఉండేలా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 37727 గ్రామీణ ప్రాంతలలో పనిచేసే ఆశాలు మరియు 2502 పట్టణ ప్రాంతలలో పనిచేసే ఆశాలు ఉన్నారు. వీరు ఈ క్రింది పనులను చేయవలసి వుంటుంది.
a) పుట్టిన బిడ్డల బరువు తూయడం మరియు
కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసిన %
b) పుట్టిన మొదటి గంటలో ఎంత % మంది
పిల్లలకు తల్లిపాలు తాగేలా చేసారు. %
c) తక్కువ బరువుతో పుట్టిన పిల్లల శాతం %
d) పూర్తి రోగనిరోధక టీకాలు పొందిన పిల్లల %
e) మీజిల్స్ టీకా పొందిన ఎంత మంది పిల్లలు పొందారు %
f) రోగనిరోధక టీకాల సెషన్‌లో ASHAలు హాజరు అయిన శాతం %
g) 3 యాంటెనటల్ చెక్-అప్‌లను పొందిన స్త్రీల శాతం
%
h) సంస్థాగత డెలివరీల శాతం %
i) సంస్థాగత డెలివరీల కోసం JSY చెల్లింపుల శాతం %
j) JSY కింద ప్రోత్సాహకాలు పొందిన ASHAల %
k) VHSNC ఫండ్ పూర్తి స్థాయి వినియోగం %
l) శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కోసం చేరిన పిల్లల సంఖ్య
m) డయేరియాతో చికిత్స పొందిన పిల్లల సంఖ్య
n) చనిపోయి మరణించిన పిల్లలు
o) చనిపోయి మరణించిన పిల్లల జనన రేటు
p) సంవత్సరం లోపు పిల్లల మరణాలు
q) నవజాత శిశు మరణాలు ఎన్ని నివేదించబడ్డాయి
r) BPL కుటుంబాలలో రెండు గర్భాల మధ్య ఎడం ప్రోత్సహించడం
s) HMIS స్థానిక ప్రాంతంలో మొదటి వారంలో క్లోరోక్విన్‌ను స్వీకరించిన జ్వరం కేసులు %
పై కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నASHAలకు PHC / UPHC లలో ప్రతి PHC కి ASHA DASH BOARD తయారు చేయుటకు ASHA Performance Monitoring System ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివలన ASHA ల యొక్క పనితీరు ఎవిధంగా వుంది, వారి నెలవారీ పనిలో ఇంకా పెండింగ్ వర్క్ యెంత ఉంధి అని PHC ల వారిగా మోనిటర్ చేస్తూ సదరు ASHAల పనిని PHC ల నుండి కూడా మోనిటరింగ్ చేయుటకు మరియు ASHAలకు చెల్లింపులు చేసే ఇన్సెంటివ్ లను సకరం పద్ధతిలో అందించే విధముగా DASH BOARD రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తునారు దానికి సంభందించిన ఫార్మేట్ ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలకు పంపించడం జరిగింది.
0 Comments