JAC గా ఏర్పడిన వైద్య ఆరోగ్య శాఖలోపనిచేసే ఉద్యోగ సంఘాలు.
PRC STRUGGLE COMMITTEE కి దన్నుగా వుంటామని ప్రతిజ్ఞ.
వైద్య ఆరోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికై కృషి.
అవసరం అయితే సమ్మెకు అయినా సిద్ధమే.
ఈ రోజు 31.01.2022 తారీఖున వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కెడర్లలో పనిచేస్తున్న వివిధ సంఘాల నేతలు అందరూ ఒక తాటి పైకి వచ్చేలా సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంనకు వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని కేడర్ల ఉద్యోగులు హాజరు అయ్యారు.
డాక్టర్స్ అసోసియేషన్ తరుపున హాజరు అయిన డా. జయధీర్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అన్ని సంఘాలు కలిసి రావడం వలన మెడికల్ అండ్ హెల్త్ JAC బలంగా వుంటుంది అందువలన సమస్యల పరిష్కారానికి అందరూ ముందుకు రావాలని తెలియచేసారు.
AP పిఆర్సి సాధన సమితి కమిటీ మీటింగ్ నందు నర్సింగ్ అసోసియేషన్ తరుపున మాట్లాడిన శాంతి భవాని గారు Timebond ప్రమోషన్స్, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు స్టాఫ్ Regulization ఇందులో ఆడ్ చేసినప్పుడు మేమంతా కలిసి ధర్నాకు దిగుతామని తెలియ పరచడం జరిగినది.
0 Comments