ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించడం కొరకు మరియు ప్రత్యేకించి మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో ఉద్యోగుల పై జరుగుతున్న దౌర్జన్య కరమైన అన్యాయాన్ని అరికట్టడం కోసం కార్యచరణ రూపొందించే విధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లోని అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి JAC గా ఏర్పడటం మరియు కార్యచరణ ప్రకటించడం కొరకు రేపు అనగా ది. 31.01.2022 ఉదయం 11గం.లకు, ఏపి యన్ జీ వో హోమ్, 3rd ఫ్లోర్ లోని రాష్ట్ర కార్యాలయం గాంధీనగర్, విజయవాడ నందు "మెడికల్ అండ్ హెల్త్ అలయన్స్" (MAHA JAC) అత్యవసర సమావేశం నిర్వహించుతున్నాము...
ప్రస్తుత చోటుచేసుకున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, పరిపాలన, టెక్నికల్, క్లాస్ ఫోర్, ఉద్యోగ సంఘాల నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రత్యేక ఆహ్వానం ద్వారా తెలియజేస్తున్నాం... ఈ కార్యక్రమంలో *డాక్టర్ జయధీర్, కన్వీనర్, ఏపి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్...కె వి శివారెడ్డి,జనరల్ సెక్రటరీ, ఏపి యన్ జీ వో అసోసియేషన్...జీ ఆస్కార్ రావ్, జనరల్ సెక్రటరీ, ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షలు 7852...అరవ పాల్, సెక్రటరీ జనరల్, ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, అధ్యక్షులు ఏపి హంస మరియు CITU, AITUC, YSRTUC, INTUC, TNTUC తదితర అనుబంధ సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగ సంఘాల నాయకులు, క్యాడర్ అసోసియేషన్ నాయకులు పాల్గొంటున్నారు...కనుక తప్పనిసరిగా అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలని మనవి చేసుకుంటున్నాము*
*Mesical And Health Alliance (MAHA JAC)*
0 Comments