Ticker

6/recent/ticker-posts

మమ్మల్ని గుర్తించండి మహా ప్రభో........

మమ్మల్ని గుర్తించండి  మహా  ప్రభో........

 వైద్య ఆరోగ్య ఉద్యోగస్తులు యొక్క సేవలు గుర్తించని ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకానికి క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది పై ప్రభుత్వం చిన్న చూపు చూడడం , ఇతర శాఖల ఉన్నతాధికారులు బెదిరింపులు చేయడం తగదని వైద్య ఆరోగ్య శాఖ లోని డాక్టర్ మొదలుకొని క్రింది స్థాయిలో పనిచేస్తున్న అటెండర్ వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లోని 70 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వారు చనిపోతే కనీసం రూపాయి కూడా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించని సందర్భాలు ఉన్నాయని , రెగ్యులర్ చేస్తామని ఎన్నో ప్రభుత్వలు  కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని, రెగ్యులర్ చేయటం లేదు కనీసం జీతం పెంచడం లేదు కానీ చేసిన సేవలను కూడా గుర్తించకపోవడం చాలా బాధకరమని, రెగ్యులర్ ఉద్యోగస్తులు ఇవ్వాల్సిన డి ఎ లు గాని పిఆర్సి గాని చెల్లించకుండా మోసం చేస్తున్నాయని, అయినప్పటికీ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నామని వారు చెప్పారు.  ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న కోవిడ్ మహమ్మారి నివారణలో మరియు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్నా, టైఫాయిడ్ మలేరియా, డెంగ్యూ , మొదలగు ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను రక్షించడంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలను పక్కనపెట్టి రాత్రనక పగలనక కష్టపడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను గుర్తించకుండా,  ప్రజలకు అందుతున్న ఈ సేవలను  ఇతర శాఖలోని అధికారులు, ఉద్యోగస్తులు మేమే ఈ సేవలు చేస్తున్నట్లుగా తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని , ఇతర శాఖలోని ఉన్నత అధికారులు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగస్తుల యొక్క జీతాలు నిలుపుదల చేయిస్తామని బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తపరిచారు  . ఎంతో కష్టపడి పని చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తులు మాత్రం చేస్తున్న పనికి ప్రచారానికి దూరంగా ఉంటూ నిరంతరం సేవ చేస్తూ, చేసిన పనికి గుర్తింపు లేక అధికారులు గుర్తించక,  ప్రభుత్వాలు గుర్తించక, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు . ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ , మండల అభివృద్ధి శాఖ , విద్యాశాఖ ఇలా ఎన్నో శాఖల యొక్క సమన్వయంతో కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం సహకారం లేకపోవడం తో గ్రామాల్లోని జనాలను ఒకచోట పిలుచుకోవడం వ్యాక్సిన్ ఇవ్వడం, ఆన్లైన్ చేయడం, మళ్లీ వారిని తరలించడం ఇలా అన్ని పనులను వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేసుకుంటుంది, ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రం ఒకరిద్దరు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో హాజరై ఫోటోలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. ఏనాడు పూర్తిస్థాయిలో కార్యక్రమం పూర్తయ్యేవరకు వివిధ శాఖల అధికారులు గాని సిబ్బంది గానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించిన సందర్భాలు లేనేలేవు. ప్రభుత్వ0 ఇచ్చినా వ్యాక్సిన్లు టార్గెట్ పూర్తి  చేయడంలో  ప్రజల్లో ఉన్న అవగాహన లోపం మూలంగా కొద్ది మంది ప్రజల నుండి గొడవలు, మేము చనిపోతే మా కుటుంబాన్ని మీరు చూసుకుంటారా అంటూ ఎదురు ప్రశ్నలు, రాసివ్వండి హామీగా అంటూ ఎదురుదాడి, మొదలగు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, అక్కడ రెవెన్యూ సిబ్బంది ఉండి చెప్పగలిగితే గనుక ఈ సమస్య ఉత్పన్నం కాకుండా వంద శాతం ప్రజానీకం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి వీలవుతుంది. ఆ దిశగా సహాయ సహకారాలు లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.  కొండలు కోనలు ఎక్కుతూ వాగులు వంకలు దాటుతూ అతి మారుమూల గ్రామాల్లోని ప్రజానీకానికి covid వ్యాక్సిన్, ప్రస్తుత   ఎపిడిమిక్  లో వ్యాపిస్తున్న వ్యాధుల నియంత్రణ కోసం ప్రజలకు అందించే వైద్య సేవల  విషయంలో రహదారి సౌకర్యం లేక వాహన సదుపాయం లేకపోయినప్పటికీ సేవలందించడంలో ఎక్కడ వెనుకంజ వేయడం లేదని ప్రభుత్వ ఆదేశాలను,  అధికారులు ఆదేశాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నామని , ఇటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, తిండి తిప్పలు లేకుండా , పండగలు మరిచిపోయి, సెలవు దినాలు కూడా మర్చిపోయి, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది నీ కాదని ఇతర శాఖల సిబ్బందిని అధికారులు మెచ్చుకోవడం,  వైద్య ఆరోగ్య శాఖ  వలన కాకుండా ఇతర శాఖల వల్లనే కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయిందని చెప్పుకోవడం,  కష్టపడి పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బంది నీ అవమానపరచడమే అని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగస్తులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిని ఒక్కసారి విధులు బహిస్కారించే పరిస్థితి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

ఇకనైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఇతర శాఖల ఉద్యోగస్తులు కూడా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల యొక్క కష్టాలను గుర్తించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగస్తులకు పిఆర్సి  ప్రకటించాలని బకాయి డి ఎ లను ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని,   వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తులకు అవార్డులు అవసరం లేదని, ఉద్యోగస్తులు పట్ల చిన్న చూపు చూడకుండా  చేసిన పనికి గుర్తింపు లభిస్తే సరిపోతుందని వారు ఆవేదన వ్యక్తపరిచారు.


Post a Comment

0 Comments