ఎటువంటి పరీక్షలతో సంభందం లేకుండా నేరుగా వచ్చే 2021అక్టోబర్ 2వతేదీ నాటికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ డిక్లేర్ చేయాలి:ఎం.డి.జాని పాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
గత కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ నుండి విడుదల అవుతున్న ఉత్తర్వులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న లక్షా ముప్ఫయి నాలుగువేల మంది సచివాలయ ఉద్యోగులను ఆందోళన కలిగిస్తున్నాయి అని ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియచేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల దృఢ సంకల్పంతో పరదర్శక పాలనకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2019వ సంవత్సరం జూలై నెలలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా అర్హత పరీక్షలు నిర్వహించి అత్యంత పారదర్శకంగా కేవలం మెరిట్ ఆధారంగా అక్టోబర్2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించి 1.34లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించారు.ఈ ఉద్యోగాలు పొందిన వారిలో 19సంవత్సరాల వయసు నుండి 48సంవత్సరాల వయసు వున్న వారు ఉద్యోగాలు పొందారు.
అయితే ఈ క్రమంలో నాడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 2 2021 తేది నాటికి ప్రొబేషన్ పూర్తి చేసి సాధారణ పే స్కేల్ పొందాల్సి వుంది.అయితే వీటిలో కొన్ని రకాల ఉద్యోగాలకు ఎ.పి.పి.యస్ ద్వారా ఆరు మసాలాకు ఒకసారి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ లు పాస్ అవ్వాలని నిబంధనలతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది.అయితే గత ఏడాదిన్నర నుండి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా కేవలం ఒక్కసారి మాత్రమే డిపార్ట్మెంట్ టెస్టులు జరిగాయి.ఈ రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ లో కనీసం నాలుగు సార్లు జరగాల్సిన పరీక్షలు ఒక్కసారి మాత్రమే జరిగాయి. ఈ ఒక్కసారి జరిగిన పరీక్షలలో దాదాపుగా 50 నుండి 60శాతం సచివాలయ ఉద్యోగులు ఉత్తీర్ణత పొందారు.
ఇదే సందర్భంలో గత 22 మాసాలుగా చాలీ చాలని 15000వేల జీతంతో కుటుంబ పోషణ భారమైనా భవిష్యత్తు పై ఆశతో,ప్రతి సచివాలయ ఉద్యోగి రాత్రనక,పగలనక ఆదివారలు,పండుగ సెలవలు అనేవి ఏవి పట్టించుకోకుండా నవశకం మొదలు కరోనా విధులు,ఎన్నికల విధులు ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులు ఏ పని అప్పగించినా నిర్విరామంగా అంకిత భావంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడంలో సచివాలయ ఉద్యోగులు చేసిన కృషి అనిర్వచనీయం.
అలాగే ముఖ్యమంత్రివర్యుల మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్థ గాంధీజీ కలలు కన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు, సాధించాల్సిన లక్ష్యం వైపుకు వేగంగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఉన్నత విద్యావంతులు ఐన సచివాలయ ఉద్యోగుల సేవలు మరింత అవసరం.ఈ సందర్బంలో ప్రభుత్వం ఉద్యోగుల పై ఎటువంటి వత్తిడి లేకుండా నేరుగా ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ వర్తింపజేయాల్సిన అవసరం వుంది.కనుక,ఇలాంటి పరిస్థితిలో రక రకాల పరీక్షల పేరిట క్రెడిట్ బేస్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి 40క్రెడిట్లతో ఉత్త్తీర్ణత సాధిస్తేనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామంటే రెండేళ్లు కష్టపడిన అనేకమంది సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎరదుర్కొనే అవకాశాలున్నాయి.
కనుక,ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు సేవ చేసే సువర్ణ అవకాశం కల్పించి రెండు కోట్ల సర్వీసులు మరియు లక్ష కోట్ల రూపాయల పైచిలుకు వివిధ సంక్షేమ పధకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం లో భాగస్వాములై విలువైన సేవాలందించిన 1.34లక్షల కుటుంబాలకు మనసున్న ముఖ్యమంత్రివర్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా అక్టోబర్2 తేది నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి ఉద్యోగుల జీవితాలలో సరిక్రొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇట్లు
ఎం.డి.జాని పాషా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రి.నెం:138/2020
చరవాణి:9640001548

0 Comments