*ఆంధ్రప్రదేశ్ డీఎస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ* తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ అరవా పాల్ మరియు APHAMSA ప్రకాశం జిల్లా అధ్యక్షులు కలిసి మన చీఫ్ సెక్రెటరీ శ్రీ ఆదిత్యనాథ్ గారిని కలిసి మన సమస్యలను వివరించడం జరిగింది.
1) _27 GO సవరణ_
2) _వర్కింగ్ కమిటీ గడువు ముగిసింది కావున రిఫర్మ్స్ సమర్పించేలా చేయమని_
3) _కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని_
4) _53వ రోజుకి చేరిన మన ధర్నా గురించి వివరించడం జరిగింది_
పై విషయాలపై విడివిడిగా సమర్పించిన రిప్రజెంటేషన్ లను పరిశీలించిన పిదప గౌరవ చీఫ్ సెక్రటరీ గారు
1) 27GO సవరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది, పూర్తి జీతం అనేది కచ్చితంగా ఉద్యోగి యొక్క కనీస హక్కు త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలియచేసారు.
2) గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ మరియు వర్కింగ్ కమిటీ యొక్క ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత వర్కింగ్ కమిటీ యొక్క రిఫర్మ్స్ త్వరగా వచ్చేవిధంగా చేసి వాటి ద్వారా మనకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
3) రెగ్యులరైజేషన్ విషయంలో రాజకీయ ఒత్తిడి కూడా అవసరం ఉంటుంది కావున పాలసీ పరమైన విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీ వంతు కృషి కూడా అవసరం అని తెలియజేశారు.
4) మన యాభై మూడు రోజుల ధర్నా కార్యక్రమం యొక్క కొన్ని ఫోటోలను సార్ కి చూపించడం జరిగింది *నేను మొదట నుండి ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నాను కచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది* అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మనకు అన్ని విధాలా సహకరించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ సెక్రెటరీ శ్రీ. అరవా పాల్ గారికి, APHAMSA ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారికి కృతజ్ఞతలు. ఇట్లు.
S. John Henry, Convenor.
APDSCCPME JAC.
0 Comments