Ticker

6/recent/ticker-posts

కాంట్రాక్టు ఉద్యోగులకు చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి హామీ...

 ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించుతా : చీప్ విప్ గడికోట శ్రీ కాంత్ రెడ్డి హమీ

 ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామేడికల్ ఉద్యోగుల జెఏసి వినతిపై స్పందన

రామాపురం(కడప జిల్లా) :- ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామేడికల్ ఉద్యోగుల జెఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అవేదన,ఆందోళన, నివేదన,నిరసన కార్యక్రమాల్లో భాగంగా 33 రోజైనా శనివారం ఉదయం 8 గంటలకు కడప జిల్లా రామపురం మండలం, సుద్దమల్ల గ్రామ పంచాయతీ యర్రమరెడ్డిగారిపల్లెలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీ కాంత్ రెడ్డిగారి స్వగృహంలో కలసి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి, జిల్లా కన్వీనర్ యస్.ఖాదర్ భాష,జిల్లా నాయకులు యం.మురళి మోహన్, యస్. ఖదీర్ తదితరులు విజ్ఞప్తి చేసారు.

వైఎస్సార్ సిపి ఎన్నికల మేనిఫెస్టో 2019 హమీ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత,సర్వీసును పరిగణనలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం అన్న హమీని సత్వరం ఆమలు చేయాలని కోరారు.

ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని ఏట్లాగు చేస్తారు, కనుక ఆలస్యం చేయకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మహమ్మరి కరోనా నియంత్రణ సేవలు అందించేందుకు కాంట్రాక్టు పారామేడికల్ ఉద్యోగులను,మిగతా శాఖల కాంట్రాక్టు ఉద్యోగులతో సంబంధలేకుండా ప్రత్యేకంగా రెగ్యులర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ప్రజామోదం ఉందని, ఉద్యోగులతోపాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారని విపులంగా చెప్పారు.

 ఇప్పటికే కడప జిల్లా నందలూరు, చిట్వేల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో కరోనా నియంత్రణ విధులు నిర్వహిస్తున్న మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు బోర్రవెంకటసుబ్బయ్య, తొట్టి నాగమునెయ్యలు కరోనాతోనే మరణించినట్లు తెలిపారు. కోర్టు కేసులతో ఎటువంటి ఆటకం లేదని, కేవలం వెంటనే రెగ్యులర్ చెయాలని కోర్టులో కేసులు ఉన్నాయని,రెగ్యులర్ చేసేస్తే వాటి వల్ల  ఎలాంటి ఇబ్బందులు రావని వివరించారు. ఈ విషయలన్ని సావధానంగా విన్న చీఫ్ విప్ గడికోట శ్రీ కాంతరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి కె.ధనుంజయరెడ్డితో సమగ్రంగా చర్చించుతానని,తర్వాత జెఏసి ప్రతినిధులతోపాటు కలిసి సంపూర్ణంగా చర్చించడానికి హమీ ఇచ్చారు.



Post a Comment

0 Comments