ఏపీఎన్జీవోల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి శివారెడ్డి సోమవారం రాయచోటి పర్యటనలో ఉండగా ఏపీ డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ కడప జిల్లా నాయకులు యం. సుదర్శన్ రాజు ముప్పాల కలసి 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలోనే వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (మగ) లను, ఏ ఎన్ ఎం లను, ఫార్మసిస్ట్ లను, ల్యాబ్ టెక్నీషియన్లును, రెగ్యులర్ చేయడానికి ఏపీఎన్జీవోల సంఘం తరపున కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ తో నలభై మూడు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు ఇస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు సత్వర న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోల రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ప్రసాద్ యాదవ్, కడప జిల్లా యూనిట్ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి , రాయచోటి తాలూకా యూనిట్ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్ రెడ్డి , కార్యదర్శి యం.వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0 Comments