Ticker

6/recent/ticker-posts

57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారు అని కావాలనే దుష్ప్రచారం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సోదర, సోదరీమణులందరికీ నమస్కారం!

ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారు అని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇపుడు సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతున్న కథనం సంవత్సరం కిందటిది.  సంవత్సరం కిందట ఇలాంటి ప్రచారం జరిగినపుడు  పదవి విరమణ వయసు తగ్గించే ఆలోచన లేదని ముఖ్యంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులు పుట్టిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని CIDకి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్  పిర్యాదు కూడా చేసింది.  

ప్రభుత్వ ఉద్యోగులను గందరగోళానికి, ఆందోళనకు గురి చేయాలనే కుట్రతో కొందరు పాత కథనాన్ని బయటకు తీసి పదే పదే ప్రచారం చేస్తూ ఉద్యోగులలో  భయాందోళనలు రెకెత్తించాలని ప్రయత్నిస్తున్నారు.  కావున పదవి విరమణ వయసు గురించి సోషల్ మీడయాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని, దీనిపై మీకు వచ్చిన మెసేజ్ లు ఇతరులకు షేర్ చేయవద్దని మనవి చేస్తున్నాం.

                                                                                                                కె వెంకటరామి రెడ్డి
                                                                                                                    చైర్మన్
                                                                                            ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్


Post a Comment

0 Comments