NVBDCP - " ప్రైడే - డ్రైడే ప్రతి శుక్రవారం డ్రైడే గ పరిగణించి దోమల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం GO.Rt.790.HMFW తేది 30.12.2020న ఆదేశాలు ఇవ్వడం జరిగింది
1. ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో పని చేసే గ్రాము / వార్డ్ ఆరోగ్య కార్యదర్శి తో పాటు పారిశుధ్య కార్యదర్శి, ఆశాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ కార్యదర్శులు, గ్రాము / వార్డ్ వాలంటీర్లు విధిగా పాల్గొనవలెను .
2. వీళ్ళు ప్రతి ఇంటిని దర్శించుతూ వారితో పాటు ప్రజలను భాగస్వామ్ములుగా చేస్తూ 'ప్రైడే - డ్రైడే గురించి వివరిస్తూ విజయవంతం చేయవలెను.
3. గ్రామ ప్రజలకు దోమల ద్వార వచ్చే మలేరియా డెంగు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రతాల గురించి అవగాహన కల్పించవలెను.
4. దోమలు అభివృద్ధి చెందుటకు అవకాశమున్న అన్ని రకాలు నీటి కంటైనర్లు, వాడని టైర్లు, ఉపయోగించని సామానులు పర్నిచర్, పూల కుండీలు, వాడిన కొబ్బరి బొండాలు, తాగునీటి పైప్ లికెజులు, ఉపయోగించని బావులు, చెత్త వేయు ప్రదేశములు తొలగించవలెను .
5. ఓవర్ హెడ్ ట్యాంకులకు మూతలు పెట్టడము, సెప్టిక్ ట్యాంకులపై నైలాన్ మెష్ కట్టడం .
6. నీటి గుంతలను, నీటి నిల్వ ఉన్న ప్రదేశాలను పూడ్చడము .
7. అవసమైన చోట నీటి నిల్వ లుపైన అయిల్ బాల్స్ వదలవలెను / లార్వా సైడ్స్ తో స్ప్రే చేయవలెను.
8. మురికి నీటి కాలులను సక్రమంగా పారేలా చేయవలెను .
9. ఇంటి చుట్టు గాని మరియు ఇంటిస్థలంలో గాని నీటి నిల్వలు వున్న ఎడల వాటిని పూడ్చమని చెప్పవలెనను . లేని యడల సంబంధిండ అధికారి వారు పూడ్పించి అయ్యే ఖర్చు హౌస్ టాక్స్ ద్వార కట్టించవలెను.
_________________________________________________________________________

0 Comments