Ticker

6/recent/ticker-posts

ధనుంజయ రెడ్డిని కలసిన కాంట్రాక్టు ఉద్యోగుల JAC



గత మూడు రోజులుగా రాజధాని అమరావతిలో మనకు సంబంధించిన పలు విషయాలపై ఉన్నత అధికారులను మన జె.ఏ.సి తరపున స్వయంగా కలిసి పలు  కీలకమైన   అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా,
 మన రెగ్యులరైజేషన్ కు సంబంధించి 2020 జూన్ 30 తో గడువు ముగిసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఉన్నత అధికారుల కమిటీలను పునరుద్ధరణ చేసి అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల గురించి అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలపై తక్షణమే జి.ఓ.ఎం నిర్వహించి మనకు తగు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవ ఆదిత్యనాధ్ దాస్ గారిని కోరడం జరిగింది. మన మిత్రులు రమణారెడ్డి గారు స్వయంగా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు రెగ్యులర్ విషయం లో ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గౌరవ ధనుంజయరెడ్డి గారిని కలిసి కోరడం జరిగింది. అందుకు ధనుంజయరెడ్డి గారు స్పందిస్తూ... తప్పకుండా అర్హులైన అందరికీ న్యాయం జరిగేలా ప్రాసెస్ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరుతో ముగుస్తున్న మన కంటిన్యూషన్ ఆర్డర్ గురించి ఆర్ధిక శాఖ లో ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరగా కంటిన్యూషన్ ఇవ్వాల్సినదిగా కోరడం జరిగింది. మనకున్నా అన్ని హక్కులూ కాలరాస్తూ ఇచ్చిన 27 జీఓ సవరణ గురించి సి.ఎస్ గారికి ఇప్పటికే మనం ఇచ్చిన వినతిపై నడుస్తున్న ఫైల్ త్వరితగతిన అమలయ్యేలా సంబంధిత ఆర్ధిక, డి.హెచ్ అధికారులను కోరడం జరిగింది.
దీనికి సంబంధించిన పలు విషయాలపై చర్చించడం జరిగింది. చనిపోయిన మన మిత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్సగ్రేషియా, అదేవిధంగా కోవిడ్ తో మరణించిన మన మిత్రులకు తక్షణమే 50 లక్షల రూపాయల పరిహారం అందించే విషయం లో ప్రభుత్వం త్వరితగతిన స్పందించి సాయం అందజేయాలని సి.ఎస్ గారిని కోరడం జరిగింది. అలాగే సుదీర్ఘంగా ఒకే చోట పనిచేస్తూ ఎలాంటి కదలిక లేకుండా ఉంటూ ఇబ్బందులు పడుతున్నా మన మిత్రుల కోసం ట్రాన్సఫర్లు జరిగేలా అవకాశం కల్పిస్తూ జి.ఓ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా, మన శాఖకు సంబంధించిన గ్రీవెన్స్ చూసేందుకు తాజాగా నియమితులైన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి గౌరవ ముద్దాడ రవిచంద్ర గారిని కలిసి మన సమస్యలు అన్నీ స్వయంగా కలిసి చెబుదామని రెండురోజులుగా జె.ఏ.సి చేసిన విశ్వప్రయత్నం ఫలించలేదు. అందుకు కారణం గౌరవ రవిచంద్ర గారు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షల్లో ఎంతో బిజీగా ఉండటం వల్ల మాత్రమే! మొత్తం మీద ఈసారి జె.ఏ.సి చేసిన కృషితో మన సమస్యలపై కసరత్తు ప్రారంభమైనట్టే. ఇక వారం వారం అమరావతిలో మన సమస్యల విషయాలపై ఫాలోఅప్ జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాము

Post a Comment

0 Comments