Ticker

6/recent/ticker-posts

కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు శత జయంతి కార్యక్రమం

10.03.2021: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సంఘ మూల విరాట్ స్వర్గీయ కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు శత జయంతి కార్యక్రమంలో ఈరోజు కడప జిల్లా రాయచోటి ఎన్జీవో అసోసియేషన్ హమ్ లో జరిగింది.

 ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్, రాయచోటి అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి యమ్ వేణుగోపాల్ రెడ్డి, సహ అధ్యక్షుడు జయచంద్ర ,లక్కిరెడ్డిపల్లె అధ్యక్షుడు బలరామ రాజు ,కోశాధికారి బి.దేవేంద్ర.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమనగంటి అనంతపురం జిల్లాలో పుట్టి ఏలూరు లో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగుల ప్రయోజనాలు మరియు సేవలందించటానికి, ఉద్యోగుల కు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు సకాలంలో రావడానికి ఒక సంఘం ఏర్పాటు చేసి దానికి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ఏలూరు లో రిజిస్టర్ చేసి రాష్ట్రమంతా తాలూకా స్థాయి నుండి ,జిల్లా ల వరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఉద్యోగుల కు అనేక రాయితీల విషయంలో రాజీ లేని పోరాటం చేసి PRC, DA లు సకాలంలో వచ్చే విధంగా కృషి చేసిన నాయకుడుగా ఉద్యోగుల మన్నన పొందిన వ్యక్తి అని వారు కొనియాడారు..

కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఆయన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ను ఏర్పాటు చేసి భారతదేశం లో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్న నాయకులు గా ఆయన సేవలను అందించారని,అదే విధంగా ఒకానొక సందర్భంలో రాజకీయ నాయకులు తో తలపడి అవసరమైతే ఉద్యోగుల సంఘం తరుపున రాజకీయాల్లో ప్రవేశించి మిమ్మల్ని ఓడిస్తానని శపథం చేసి ఏలూరు నియోజకవర్గము నుండి కాకలు తీరిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను ఎదురించి ఇండిపెండెంట్ అభ్యర్థి గా నిలబడి మంచి మెజార్టీతో గెలిచి ఏలూరు నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన ఏకైక ఉద్యోగ సంఘ నాయకులు ఆమనగంటి అని అభివర్ణించారు..

అటువంటి గొప్ప నాయకుల స్పూర్తితో ఈరోజు ఏపీన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగుల ప్రయోజనాలు కోసమే కాకుండా రాష్ట్ర ప్రజలు కోసం అనేక సందర్భాల్లో అండగా నిలబడిందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు మహ్మద్ భాష ,దేవేంద్ర రెడ్డి ,రెడ్డి నాయక్. సురేంద్ర రెడ్డి ,విక్రమ్ ,రమణ పాల్గొన్నారు.



Post a Comment

0 Comments