మహిళలు-ప్రత్యేక
సౌలభ్యాలు- సెలవులు
1.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33%
రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా
వెసులుబాటు కల్పించినది. (G.O.Ms.No.237,GAD
తేది:28-05-1996).
2.
ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల
పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం
సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు. (G.O.Ms.No.27 తేది:09-01-2004)
3.
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత
కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. (G.O.Ms.No.350
తేది:30-07-1999)
4.
అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన
సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ
అవకాశం. (Memo.No.17897
తేది:20-04-2000)
5.
పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల
లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు. (G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)
6.
ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి
పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు. (మెమో.నం.7679 తేది:14-09-2010)
7.
మార్చి 8న మహిళా
దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు. (G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)
8.
మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల
అదనపు సెలవు మంజూరు. (G.O.Ms.No.374
తేది:16-03-1996)
9.
జూనియర్ లెక్చరర్లకు
5
రోజుల అదనపు సెలవుల మంజూరు. (G.O.Ms.No.03 తేది:05-01-2011)
10.మహిళా
ఉద్యోగులకు 5
రోజుల అదనపు సెలవు మంజూరు. (G.O.Ms.No.142 తేది:01-09-2018)
11. వివాహం
ఐన మహిళా ఉద్యోగికి 180
రోజులు జీతం తో కూడిన ప్రసూతి
సెలవు మంజూరు చేయబడుతుంది. (G.O.Ms.No.152 తేది:04-05-2010)
12. మహిళా
ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా
ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల
మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు
మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415
M&H తేది:10-06-1968) (G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)
13.మహిళా
ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు
ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)
14.ఇద్దరికంటే
తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్
తరువాత మగ,ఆడ
పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు
లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)
15.మహిళా
ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న
సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు
మంజూరుచేస్తారు. (G.O.Ms.No.52
F&P తేది:01-04-2011)
16.చట్టబద్దంగా
గాని,అప్రయత్నంగా
గాని గర్భస్రావం(Abortion)
జరిగినచో 6
వారాల సెలవు మంజూరుచేయబడును. (G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)
17.మహిళా
ఉద్యోగులు,టీచర్లకు
వారి మొత్తం సర్వీసులో 60 రోజులు
శిశుసంరక్షణ సెలవు మంజూరు. (G.O.Ms.No.209 తేది:21-11-2016)

0 Comments