Ticker

6/recent/ticker-posts

104 సేవలు (M M U సంచార వైద్య విభాగము) నిర్వహణ

 104 సేవలు

M M U సంచార వైద్య విభాగము

 M M U సంచార వైద్య విభాగము  ఈ క్రింది సభ్యులుహాజరుఅవుతారు

1. 104 నుండి  2.ఉపకేంద్రము /గ్రామసచివాలయంనుండి

  • ·       డాక్టర్  -   ఉపకేంద్ర ఏ.యన్.యం. (A .N .M)
  • ·       డేటా ఎంట్రీ ఆపరేటర్   -    గ్రామసచివాలయ ఏ.యన్.యం. (A .N .M )
  • ·       డ్రైవర్  -   గ్రామ సచివాలయ పరిధిలోని వాలంటీర్లు
  • ·       గ్రామసచివాలయపరిధిలోని ఆశాలు (ASHA )
  • ·       గ్రామ సచివాలయ సెక్రటరీ
  • ·       సర్పంచ్

పైనపేర్కొన్నవారందరూ ,గ్రామంలో M M U  క్లినిక్ నిర్వహించే ప్రదేశం లో ఉదయం 9 గం 30 నిమిషములకుహాజరుకావలయును .

అందరి హాజరును ద్రువీకరించుకున్న తరువాత డాక్టర్ ఈ కింది వాటిని కూడా ద్రువీకరించవలయును

  1. కనీసం 60 మందికి సరిపడా మందుల లభ్యత
  2. కనీసం 60 మందికి సరిపడా పరీక్షా పరికరములు మరియు రసాయనాలు

ANM, U  క్లినిక్ నిర్వహించుటకు  సంబంధించిన పరికరాలు మరియు వినియోగించే వస్తువులు (గ్లూకొమీటర్, గ్లూకోమీటర్ స్ట్రిప్పులు, HB మీటర్, UPTకిట్టులు, URINE గ్లూకోస్ స్ట్రిప్పులు, ఆల్బుమిన్ స్ట్రిప్పులు, కొలత టేపు, MCP కార్డులు మొదలగునవి.

ANM 60 మందిరోగులకు సరిపడా వినియోగ వస్తువులను తీసుకొనిరావలెను.

డాక్టర్: క్లినిక్ నిర్వహణ కొరకు ముఖ్య బాధ్యులు.

డాక్టర్ మరియు తన సిబ్బంది ఈ క్రింద పేర్కొన్న కార్యాలను నిర్వర్తిస్తారు.

  1. .పీ సేవలను ఉదయం9గం:30 నిమిషముల నుండి మధ్యాన్నం 12:30.గం. వరకు నిర్వర్తిస్తారు. భోజన విరామం తరువాత, 1:30 గం. ల నుండి పాఠశాలలు, కదలలేని స్థితిలో ఉన్న వారిని, వయోవృద్ధులని, క్షయ వ్యాధిగ్రస్థులను, కుష్టువ్యాధిగ్రస్థులను, బాలింతలను మొదలగు వారిని సందర్శించవలెను.
  2. కోవిడ్ వ్యాధి లక్షణాలను గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వవలెను.
  3. అత్యవసర పరిస్థితులు (కుక్కకాటు, తేలుకాటు, పాముకాటు, కీటకపుకాటు, పాయిజనింగ్ కేసులు, దెబ్బలు తగిలిన వారు, మరియు గాయాల పాలయిన వారు మొ||.) రోగులకు ప్రధమ చికిత్స అందించి మెరుగయిన చికిత్స కొరకు పెద్దాసుపత్రికి పంపించుట.
  4. విశాల సమ్మేళనాలు, మరియు సంతలు జరిగే రోజులందు క్యాంపునిర్వహణ.
  5. నిఘా, దోమల ఉత్పత్తి ప్రదేశాల గుర్తింపు, DRY DAY, దోమతెరల సరైన వాడుక, పరిశుభ్రత మరియు పారిశుధ్యం నిర్వహణ కొరకు ప్రజల సంవేద్యేకరణ.
  6. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలందు పాల్గొనుట (PPI, IMI, IDCF, నుల్లి పురుగు నివారణ దినోత్సవం, LCDC మొ||.)
  7. ఉన్నత సేవలు అవసరమయిన వారిని గుర్తించవలెను.
  8. ఆవాస గ్రామంలో ప్రతి పౌరుడికి సంబంధించిన ఆరోగ్య దీపిక (ముద్రిత సమాచారం) తయారు చేయడం. (Standard Health record for HEALTH CARD)

డేటా ఎంట్రీ ఆపరేటర్ D.E.O

  1. I.T. App నందు రోగుల సమాచారం పొందుపరచుట.
  2. రోజుకు మూడుసార్లు A.E.B.A.S. హాజరిని సంగ్రహించుట.
  3. i.పార్కింగు ప్రదేశం నుండి మొదలయ్యే ముందు.
  4. ii. క్లినిక్ మొదలయ్యే  ముందు
  5. iii.గ్రామము వీడే ముందు
  6. ఉపయోగించిన మందుల సమాచారం పొందు పరచుట మరియు మందుల కొరకు ఇండెంట్ను పెట్టి డాక్టరు గారి తో ద్రువీకరించుట.
  7. పరికరాల పని తీరును గుర్తించి వైద్యాధికారికి సమాచారం ఇచ్చుట.

ఏ.యన్.యం.  A.N.M.

  1. A.N.M., ASHA కార్యకర్తలు, మరియు వాలంటీర్లు, MMU క్లినిక్  నిర్వహించే రోజులను గ్రామస్థులకు ముందుగా తెలియపరచుట.
  2. ASHA కార్యకర్తల సహాయంతో వైద్యాధికారి పురమాయించిన, పరీక్షల నిర్వహణ, మరియు మందుల పంపిణీ చేయుట.
  3. వైద్యాధికారి, ASHA కార్యకర్తలు మరియు గ్రామవలంటీర్లతో గృహసందర్శన.
  4. జాతీయ కార్యక్రమలందు జాగరూకత కల్పించుట.
  5. వైద్యాధికారి పురమాయించిన ఇతర కార్యక్రమాలని నిర్వహించటం.

ఆశా ASHA:

  1. MMU క్లినిక్  నిర్వహించే రోజులను గ్రామస్తులకు ముందుగా తెలియ పరచుట.
  2. రోగులను MMU క్లినిక్ కు తరలించి ANM లకు సహకరించుట.
  3. వైద్యాధికారి మరియు ANM లతో గృహ సందర్శనానికి వెళ్ళుట.
  4. వైద్యాధికారి పురమాయించిన ఇతర కార్యక్రమాలని నిర్వహించుట.

వాలంటీర్లు

  1. రోగులను MMU క్లినిక్ కుతరలించటం లో సహాయంచేయుట
  2. MMU క్లినిక్ కు గురించి ప్రజలకు అవగాహన చేయుట.




Post a Comment

0 Comments