జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా --విజయవాడ వారి అత్యవసర ఆదేశాలు
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల అనుసరించి, గ్రామస్థాయి నుంచి మండలము స్థాయి, తదుపరి, జిల్లా స్థాయి వరకు, ఆడ శిశువులపై వివక్షతో, జననం జరగకుండా జరుగు బృణ హత్యలను, అరికట్టుటకు PCPNDT యాక్ట్ లొ భాగంగా లింగ నిర్ధారణ పరీక్షలు, చేయుట చట్టరీత్యా నేరమని, తెలియపరచుట జరుగుచున్నది.
అట్లు చేయించుకున్న వారికి, నిర్ధారణ పరీక్ష చేసిన స్కాన్ సెంటర్ వారికి, కఠినమైన శిక్షకు గురి కావలసి ఉంటుంది.
కావున గ్రామస్థాయి లోని వివిధ సంఘాలు, వారి పెద్దలు మరియు నాయకులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మరియు ప్రాథమిక పాఠశాలలో,ఉన్నత పాఠశాలలో, పిల్లల ద్వారా ర్యాలీలు ప్రచారాలు నిర్వహించాలని, ఆదేశించటమైనది.
గ్రామస్థాయిలోనే మహిళా సంఘాలు, మహిళా మండలి ద్వారా, లింగ వివక్షత నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొనుట చట్టరీత్యా నేరమని, అందుకు ప్రోత్సహించిన వారికి, లింగ నిర్ధారణ పరీక్ష ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు,తగిన జరిమానా తో పాటు శిక్ష పడుతుందని విస్తృత ప్రచారము నిర్వహించ వలెనని,ఆదేశించడం అయినది.
ఈ అన్ని కార్యక్రమాలను వివిధ ప్రచారమాధ్యమాలకు తెలియజేయాలని, ఈ కార్యక్రమాల యొక్క ఫోటోలను మన వైద్య ఆరోగ్యశాఖ మీడియా గ్రూపు నందు పోస్ట్ చేయాలని, ఆ రోజే కార్యక్రమం యొక్క రిపోర్ట్ జిల్లాకు పంపించాలని, ఆదేశించడం అయినది.
ఇందుకు సంబంధించిన బ్యానర్ తాలూకా నమూనా మరియు విధివిధానాలను పూర్తిగా వివరించుచు మీకు నాలుగు రోజుల కిందట ఒక మెయిల్ పంపబడినది.
కానీ మండల స్థాయి మరియు పట్టణ స్థాయి వైద్యాధికారులు ఎవరు ఈ కార్యక్రమం పై దృష్టి పెట్టలేదు, కావున వెంటనే మీయొక్క ప్రణాళికను సిద్ధపరచుకొని, బ్యానర్ను ఏర్పాటు చేసుకొని సోమవారం నుండి విస్తృత ప్రచారం చేయవలసిందిగా కలెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ.

0 Comments