lide

Ticker

6/recent/ticker-posts

డిసిహెచ్‌యస్‌ల పని తీరులో మార్పు రావాలి – మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్

తాడేపల్లి, జూలై 8: 
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు  జిల్లాల ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (డిసిహెచ్‌యస్) పని తీరులో గణనీయమైన మార్పు అవసరమని. డిసిహెచ్‌యస్‌లు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలోని ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యతను మెరుగుపరిచే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

తాడేపల్లిలోని సెకండ‌రీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 26 జిల్లాల డిసిహెచ్‌యస్‌లకు నిర్వహించిన నాలుగు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అవినీతి అసహ్యకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదనివన్నారు. సమయపాలన పాటించని వైద్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ప్రధానంగా ఆయన చేసిన సూచనలు ఇవే:

  • జిల్లాల అధికారులు నాయకత్వ లక్షణాలతో మార్గదర్శకులుగా ఎదగాలి.
  • సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో సిజేరియన్ శస్త్రచికిత్సల శాతం గణనీయంగా తగ్గించాలి. సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ప్రిఆథరైజేషన్లు పెంపు దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత 24 శాతాన్ని 80 శాతానికి చేరేలా లక్ష్యంగా పెట్టుకోవాలి.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత 84 శాతం హాజరును 95 శాతానికి పెంచాలి.
  • జిల్లాల్లో మౌలిక వసతుల లేని పరిస్థితులను సరిచేయడానికి నిరంతర పర్యవేక్షణ మరియు ఒరియెంటేషన్ అవసరం.
  • డిసిహెచ్‌యస్‌లు ఆరోగ్య పరిరక్షణలో ఒక గట్టి వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి.
  • అవినీతిని 61 శాతం నుంచి 40 శాతానికి తగ్గించిన ఐవిఆర్‌ఎస్ ఫలితాలు ప్రజల్లో విశ్వాసం పెరిగిందని సూచిస్తున్నాయని తెలిపారు.

సేవల పెంపు & సదుపాయాల అభివృద్ధి:

  • గత ఏడాది కాలంలో 90 ఆసుపత్రుల్లో అల్ట్రాసోనోగ్రఫీ సేవలు, 149 ఎక్స్‌రే యంత్రాలు, 89 ఆసుపత్రుల్లో టెలీరేడియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • 13 కొత్త ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు (IPHL), 20 డయాలసిస్ సెంటర్లు స్థాపించబడ్డాయి.
  • 2024-25లో 2.41 కోట్ల ఓపీ సేవలు నమోదు కాగా, ఇది రోజుకి సగటున ఒక లక్ష సేవలుగా ఉంది.

స్ట్రాటజిక్ విజన్:
2047 నాటికి 'స్వర్ణాంధ్రప్రదేశ్' లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల భాగస్వామ్యం అవసరమని, అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కీలకం అవుతుందన్నారు.

శిక్షణా శిబిరంలో సెకండ‌రీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments