ప్రెస్ నోట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సాధారణ పరిపాలన (సేవల సంక్షేమం) శాఖ
మెమో నెం: GAD01-SW0DMDS/4/2025-SW, తేదీ: 06-07-2025
విషయం: రాష్ట్రంలోని అన్ని శాఖాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లచే ప్రతి నెలా మూడవ శుక్రవారాన్ని “ఉద్యోగుల ఫిర్యాదు దినోత్సవం”గా నిర్వహించుట – కచ్చితంగా అమలు చేయవలసిన చర్యలు – సూచనలు జారీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వేగంగా పరిష్కరించేందుకు ప్రతి నెల మూడవ శుక్రవారాన్ని “ఉద్యోగుల ఫిర్యాదు దినోత్సవం”గా నిర్వహించాలని జి.ఓ.ఆర్.టి. నెం. 1233, తేది: 24-06-2023 ప్రకారం అన్ని శాఖాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేయబడినవి.
ఈ సందర్భంగా, ఉద్యోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, నిర్ధిష్ట కాలపట్టికలో పరిష్కరించుటకు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఫిర్యాదులపై చర్యల నివేదికలు (ATRs) ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది.
కానీ, ప్రభుత్వ దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం, గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం చాలా చోట్ల నిర్వహించబడకపోవడం గమనించబడింది. ఈ నేపథ్యంలో, జి.ఓ. నెం. 1233 లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం, ఈ కార్యక్రమాన్ని తదితర ఆలస్యం లేకుండా కచ్చితంగా నిర్వహించుటకు అందరూ చర్యలు తీసుకోవాలని మళ్లీ సూచనలు జారీ చేయబడినవి.
ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కలిగినది మరియు సమస్యలను స్థానిక స్థాయిలో త్వరితంగా పరిష్కరించుటకు సహాయపడుతుంది.
అన్ని శాఖాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లు ఈ దినోత్సవాన్ని అత్యంత ప్రాముఖ్యతతో నిర్వహించాలని, ప్రభుత్వం ఆదేశిస్తోంది.
శంషేర్ సింగ్ రావత్
ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (సేవలు మరియు మానవ వనరుల నిర్వహణ), ఏపీ ప్రభుత్వం
0 Comments